హైదరాబాద్లో శ్రీకర సొసైటీ కొత్త బ్రాంచి ఓపెన్

హైదరాబాద్లో శ్రీకర సొసైటీ కొత్త బ్రాంచి ఓపెన్

హైదరాబాద్​, వెలుగు: సంస్థకు పదేళ్లు నిండిన సందర్భంగా శ్రీకర మ్యూచువల్లి ఎయిడెడ్ కో–-ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ లిమిటెడ్ తమ కొత్త శాఖను హైదరాబాద్ నల్లగండ్లలో ప్రారంభించింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిలుగా జక్కంపూడి రాజేంద్ర కుమార్ (హెడ్ కోచ్, - పుల్లెల గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీ ) హాజరయ్యారు. 

ఈ సందర్భంగా  సొసైటీ చైర్మన్ జ్యోత్స్నమాట్లాడుతూ, ఈ  పదేళ్లలో తమ సంస్థ వేలాది మందికి  సేవింగ్స్ అకౌంట్లు, ఫిక్స్డ్ డిపాజిట్లు , లోన్స్ వంటి సేవలను అందించామని తెలిపారు.   పదేళ్లలో శ్రీకర రూ. 300 కోట్ల డిపాజిట్లు సేకరించిందని, రూ. 240 కోట్ల రుణాలను మహిళా వ్యాపారస్తులకు మంజూరు చేసిందని చెప్పారు. భవిష్యత్తులో మరిన్ని ప్రొడక్టులను ప్రవేశపెడతామని సొసైటీ ప్రెసిడెంట్ చంద్రశేఖర్ వెల్లడించారు.