శ్రీ కృష్ణాష్టమి శుభ ముహూర్తం ఇదే...

శ్రీ కృష్ణాష్టమి శుభ ముహూర్తం ఇదే...

హిందూ క్యాలెండర్ ప్రకారం, ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో క్రిష్ణ పక్షంలో వచ్చే అష్టమి తిథి నాడు శ్రీ కృష్ణ జన్మాష్టమి జరుపుకుంటారు. కన్నయ్య పుట్టినరోజునే దేశవ్యాప్తంగా జన్మాష్టమి లేదా గోకులాష్టమి, శ్రీ కృష్ణ జయంతి వేడుకలను ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు. ఈ పవిత్రమైన రోజున చిన్నారులకు కన్నయ్య రూపంలో అలంకరించి పూజిస్తారు. ఈ వ్రతాన్ని ఆచరించిన వారికి కోరిన కోరికలన్నీ నెరవేరుతాయని నమ్ముతారు. ఇదిలా ఉండగా ఈ ఏడాది కృష్ణాష్టమి వేడుకలను సెప్టెంబర్ 6, 7వ తేదీల్లో జరుపుకోనున్నారు.ఈ సందర్భంగా కృష్ణాష్టమి శుభ ముహుర్తం, గోకులాష్టమి విశిష్టతలేంటో తెలుసుకుందాం…

జన్మాష్టమి పూజా ముహుర్తం..

తెలుగు పంచాంగం ప్రకారం, సెప్టెంబర్ 6న ఉదయం 7:57 గంటలకు అష్టమి తిథి ప్రారంభమవుతుంది. ఇదే రోజున మధ్యాహ్నం 2:39 గంటలకు రోహిణి నక్షత్రం కూడా ప్రారంభమవుతుంది. అందుకే ఈరోజునే జన్మాష్టమి వేడుకలను జరుపుకోవాలని పండితులు చెబుతున్నారు. అయితే వైష్ణవులు మాత్రమే సెప్టెంబర్ 7వ తేదీన శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలను జరుపుకోనున్నారు. ఇదే సమయంలో రవి యోగం, సర్వార్ద సిద్ధి యోగం కూడా ఏర్పడనున్నాయి. ఈ పర్వదినాన ఉపవాస దీక్షను ఆచరిస్తారు. 
 

శ్రీ కృష్ణాష్టమి 6 సెప్టెంబర్ 2023 బుధవారం రాత్రి 11:57 గంటల నుంచి 12:42 గంటల వరకు పూజలు చేస్తారు. కన్నయ్య రోహిణి నక్షత్రంలో అర్ధరాత్రి జన్మించాడని, సెప్టెంబర్ 6వ తేదీ నుంచే రోహిణి నక్షత్రం ప్రారంభమవుతున్నందున, ఈ పవిత్రమైన రోజే గోకులాష్టమి వేడుకలను జరుపుకుంటారు. సెప్టెంబర్ 7వ తేదీ ఉదయం 10:25 గంటలకు ముగుస్తుంది. ఉపవాస వ్రతం ఆచరించే వారు సెప్టెంబర్ 7వ తేదీ ఉదయం 6:02 గంటల నుంచి సాయంత్రం 4:14 గంటల మధ్య విరమించాలని చెబుున్నారు. 

సెప్టెంబర్ 7న వైష్ణవులు..


వైష్ణవులకు సెప్టెంబర్ 7వ తేదీన ఉదయం తిథిలో అష్టమి తిథి ప్రారంభమవుతుంది. అయితే రోహిణి నక్షత్రం యాధ్రుచ్చికంగా ఉండవు. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 7వ తేదీన శ్రీ కృష్ణాష్టమి వేడుకలను జరుపుకోనున్నారు. కన్నయ్య చిన్నతనంలో గోకులంలో పెరిగి పెద్దకావడం వల్ల గోకులాష్టమి అని కూడా అంటారు.

స్కంద పురాణంలో...

కృష్ణాష్టమి వేళ ఒకపూట భోజనం చేసి కన్నయ్యకు పూజ చేసి వేణుగోపాల స్వామి ఆలయాలు దర్శించుకునే వారికి కోటి జన్మల పుణ్యం లభిస్తుందని పండితులు చెబుతారు. అదేవిధంగా ఆలయాల్లో అష్టోత్తర పూజ, సహస్రనామా పూజ చేయించుకునే వారికి అష్ట ఐశ్వర్యాలు, సకల శుభకాలు కలుగుతాయని చాలా మంది నమ్ముతారు. ఈ పవిత్రమైన రోజున కన్నయ్యను భక్తి శ్రద్ధలతో పూజిస్తే కష్టాలన్నీ తొలగిపోయి, ధర్మార్థ కామ మోక్ష ప్రాప్తి కలుగుతుందని స్కంద పురాణంలో వివరించబడింది.

గోపాల మంత్రాలతో..

సంతానం లేని వారు, వివాహం కావాల్సిన వారు కృష్ణాష్టమి రోజున బాల కృష్ణుడిని సంతాన గోపాల మంత్రంతో పూజిస్తే కోరికలన్నీ నెరవేరుతాయని చాలా మంది చెబుతారు. ఇదే రోజు భాగవంతం, భగవద్డీత పఠించాలి. కన్నయ్య అర్ధరాత్రి జన్మించిన తర్వాత జన్మించాడు కాబట్టి ఈరోజంతా ఉపవాసం ఉండి అర్థరాత్రి వేళ కన్నయ్యకు పూజలు చేసి, ఆ మరుసటి రోజున వైష్ణవ ఆలయాల్లో ఉపవాసం విరమించాలి.