చిన్ని కృష్ణయ్యకు ఏ రాశి వారు ఏం సమర్పించాలో తెలుసా...

చిన్ని కృష్ణయ్యకు  ఏ రాశి వారు ఏం సమర్పించాలో తెలుసా...

హిందువుల ముఖ్యమైన పండుగల్లో కృష్ణాష్టమి ఒకటి. దీన్ని గోకులాష్టమి అని కూడా పిలుస్తారు. శ్రీకృష్ణుని జన్మదినాన్ని పురస్కరించుకుని శ్రావణమాసం అష్టమి రోజున ఈ పండుగను జరుపుకుంటారు. ఈ ఏడాది సెప్టెంబర్ 6, 7 రెండు రోజులు న వచ్చిన శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలకు ప్రజలు సిద్ధమవుతున్నారు. అయితే 7వతేదీన కృష్ణుని పూజించి .. నివేదన సమర్పిస్తే కోరిన కోరికలు తీరుతాయని పండితులు చెబుతున్నారు.  జ్యోతిష్య శాస్త్ర ప్రకారంగా రేపు ( సెప్టెంబర్ 7) శ్రీకృష్ణుడిని ఏ రాశివారు ఏవిధంగా ఏ విధంగా పూజించి.. ఎలాంటి పదార్దాలు నివేదించాలో జ్యోతిష్య నిపుణులు తెలిపారు.  ఇప్పుడు ఆ వివరాలను ఒకసారి పరిశీలిద్దాం...

 మేష రాశి 

పూజా విధానం: కృష్ణుడి విగ్రహాన్ని ఎర్రటి వస్త్రంతో అలంకరించండి.

నివేదన పదార్దం: శ్రీకృష్ణునికి పంచదార, దానిమ్మపండును భక్తితో సమర్పించాలి.  

ఫలితము: ఇవి పాటించడం ద్వారా మేషరాశివారి కోరికలను నెరవేర్చడానికి భగవంతుని ఆశీర్వాదిస్తాడని నమ్మకం.

 వృషభ రాశి

పూజా విధానం: కొబ్బరి లడ్డూలు, తెలుపు రంగు స్వీట్లను దేవుని ముందు ఉంచి పూజించాలి. 

నివేదన పదార్దం: శ్రీకృష్ణునికి వెన్న సమర్పించాలి

ఫలితము: మంచి ఆరోగ్యం కోసం ఆశీర్వాదం అందిస్తాడని ప్రజల నమ్మకం.

 మిథున రాశి

పూజా విధానం: శ్రీకృష్ణుడిని తమళపాకులు, నెమలి ఈకలలు, ఆకుపచ్చ వస్త్రంతో అలంకరించండి

నివేదన పదార్దం: ఆవు నెయ్యి, ఆవు పాలు, పెరుగు, ఆకుపచ్చని పండ్లు

ఫలితము:  వృత్తిపరంగా, వ్యక్తిగత జీవితంలో వృద్ధి, సంతోషం

  కర్కాటక రాశి

పూజా విధానం: :దేవతామూర్తిని తెలుపు, వెండి రంగు వస్త్రంతో అలంకరించండి.

నివేదన పదార్దం:  పాలు, వెన్న, అరటిపండ్లు (సంతానం పొందాలనుకొనేవారు కుంకుమపువ్వు కలిపిన పాలు)

ఫలితము: తల్లితండ్రులు కావడం కోసం శ్రీకృష్ణుని అనుగ్రహం పొందడం కోసం 

 సింహరాశి 

పూజా విధానం: ఎరుపు రంగులో ఉండే  వస్త్రాన్ని కట్టి... ఎర్రటి పూలతో పూజించాలి 

నివేదన పదార్దం: ఆవు నెయ్యి, ఎర్రటి పండ్లు 

ఫలితము: వృత్తి పరంగా హోదా, గౌరవం పెరుగుతుంది

కన్యారాశి 

పూజా విధానం:  ఆకుపచ్చ రంగు వస్త్రం కట్టి.. పసుపు రంగు పూలతో పూజించాలి

నివేదన పదార్దం:  మావ ( పాలకోవ), దూద్ పెడా

ఫలితము: జీవితంలో మంచి అవకాశాలు, సానుకూలత

తులారాశి

పూజా విధానం:  కృష్ణుడిని ఆవు పాలతో అభిషేకం చేసి... ముదురు ఆకుపచ్చ రంగు వస్త్రం కట్టి .. పారిజాత పుష్పాలతో పూజించాలి

నివేదన పదార్దం: స్వచ్ఛమైన నెయ్యి

ఫలితము: దీర్ఘకాలిక రోగాలకు పరిష్కారం... ఆనందమయంగా జీవితం

వృశ్చికరాశి

పూజా విధానం:  ఆవు నెయ్యి, తేనెతో అభిషేకం చేసి.. తెల్లటి వస్త్రం కట్టి...గులాబీ పూలతో అర్చన

నివేదన పదార్దం: ఆవు పాలు

ఫలితము: కృష్ణుని ఆశీర్వాదం.. అన్ని సమస్యల నుంచి ఉపశమనం

ధనస్సు రాశి 

పూజా విధానం: శ్రీకృష్ణుని విగ్రహాన్ని చందనంతో అలంకరించి... ఎర్రటి పూలతో అర్చన  

నివేదన పదార్దం: పండ్లు, పంచామృతాలు,పసుపురంగు మిఠాయి

ఫలితము: కోరిక కోర్కెలు తీరడం... కృష్ణుని ఆశీర్వాదం

మకర రాశి

పూజా విధానం:  . కృష్ణుడి విగ్రహానికి తేనె రంగు వస్త్రం కట్టి..ఆకుపచ్చ పూలతో పూజించాలి

నివేదన పదార్దం:  తీపితో కూడిన తమలపాకులు

ఫలితము: జీవితంలో సానుకూల మార్పులు, గోపాలుడి ఆశీర్వాదం

కుంభ రాశి

పూజా విధానం: శ్రీ కృష్ణునికి షోడశోపచారాల పూజలు, అష్టోత్తరం చదువుతూ  పుష్పాలతో అర్చన 

నివేదన పదార్దం:  డ్రై ఫ్రూట్స్, ఏదైనా ఎర్రటి రంగు స్వీట్లు

ఫలితము:శ్రీకృష్ణుని ఆశీర్వాదం,అదృష్టం

 మీన రాశి

పూజా విధానం:  ఆకుపచ్చ రంగు వస్త్రం కట్టి.. ఎరుపు రంగు, పసుపు రంగు పూలతో అర్బన 

నివేదన పదార్దం:  నెయ్యి, బెల్లంతో తయారు చేసిన పదార్ధాలు

ఫలితము: రియల్ ఎస్టేట్ వెంచర్లకు అనుకూలం, సంతోషంగా జీవితం