ఈ నెల 14 నుంచి శ్రీలక్ష్మీ నరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు

శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలకు యాదాద్రి ముస్తాబైంది. నేటి నుంచి ఈ నెల 14వరకు ఉత్సవాలు జరుగనున్నాయి. ఈ నెల 28న మహాకుంభ సంప్రోక్షణ ఉన్నందున బాలాలయంలోనే బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు చేశారు. స్వస్తీవాచనంతో నేడు ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈనెల 10న ఎదుర్కోలు, 11న తిరు కల్యాణ మహోత్సవం, 12న దివ్యవిమానరథోత్సవం, 13న మహాపూర్ణాహుతి, చక్రతీర్థం కార్యక్రమాలను నిర్వహించనున్నారు. 14న శతఘటాభిషేకంతో ఉత్సవాలు పరిసమాప్తి కానున్నాయి. 

ప్రతి సంవత్సరం ఫాల్గుణ మాసంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతాయి. ఈ ఉత్సవాలతో ఆలయం 11రోజుల పాటు ముక్కోటి దేవతలకు విడిదిగా మారుతుందని అర్చకులు చెబుతున్నారు. విశ్వక్సేన పూజలతో మొదలైన ఉత్సవాలు స్వయంభువులకు నిర్వహించే అష్టోత్తర శతఘటాభిషేకంతో పరిపూర్ణం అవుతాయి. మొదట ధ్వజారోహణంలో మహావిష్ణువు వాహనమైన గరుత్మంతుడికి పూజలు నిర్వహిస్తారు. మూడోరోజు నుంచి స్వామివారి అలంకార సంబరాలు జరుపుతారు. ఏడు, ఎనిమిది, తొమ్మిది రోజుల్లో విశేష పర్వాలైన ఎదుర్కోలు, తిరుకల్యాణ మహోత్సవం, రథయాత్ర నిర్వహిస్తారు. పదోరోజున చక్రతీర్థ స్నానం ఉంటుంది.

For More News..

మేయర్ పీఠంపై తొలిసారి దళిత మహిళ

ఒక్కరోజే 15 లక్షల చలాన్లు క్లియర్

విరాట్ వందో టెస్ట్ కు అనుష్క