నర్సన్న హుండీ ఆదాయం రూ.1.89 కోట్లు

యాదగిరిగుట్ట, వెలుగు: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయానికి 22 రోజుల్లో రూ.1.89 కోట్ల ఆదాయం వచ్చింది.  బుధవారం ఎస్పీఎఫ్, హోంగార్డుల భద్రత నడుమ హుండీలను సత్యనారాయణస్వామి వ్రత మండపంలోని ప్రత్యేక హాల్ కు తరలించి ఈవో గీతారెడ్డి, చైర్మన్ నరసింహమూర్తి పర్యవేక్షణలో  లెక్కించారు.  రూ.1,89,04,607 నగదు, 66 గ్రాముల బంగారం, 1.5 కిలోల వెండిని భక్తులు సమర్పించారు.

 2158 అమెరికా డాలర్లు, 30 యూఏఈ దిర్హామ్స్, 30ఆస్ట్రేలియా  డాలర్లు, 20 కెనడా డాలర్లు, 100 ఓమన్ బైసా, 42ఖతార్, 70యూరోప్ , 71 రియాల్స్,10 నేపాల్, 14,000 ఇండోనేషియా కరెన్సీ, 1000 చైనా, 100రష్యా , 1/2బహరైన్ , 5సింగపూర్ , 25ఇంగ్లాండ్ , 2 మలేషియా కరెన్సీ వచ్చినట్లు ఆఫీసర్లు వెల్లడించారు.