
ఛటోగ్రామ్: బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌లో శ్రీలంక భారీ స్కోరు చేసింది. కమింద్ మెండిస్ (90*), ధనంజయ డిసిల్వా (70) చెలరేగడంతో.. ఆదివారం రెండో రోజు లంక తొలి ఇన్నింగ్స్‌లో 159 ఓవర్లలో 531 రన్స్‌కు ఆలౌటైంది. 314/4 ఓవర్‌నైట్ స్కోరుతో ఆట కొనసాగించిన లంకకు చండిమల్ (59), ధనంజయ ఐదో వికెట్‌కు 86 రన్స్ జోడించారు. ఆ తర్వాత కమింద్, జయసూరియా (28) ఏడో వికెట్‌కు 65 రన్స్ జత చేశారు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 15 ఓవర్లలో 55/1 స్కోరు చేసింది. ఆట ముగిసే టైమ్‌కు జాకీర్ హసన్ (28*), తైజుల్ ఇస్లామ్ (0*) క్రీజులో ఉన్నారు. హసన్ జాయ్ (21) నిరాశపర్చాడు.