బీఆర్ఎస్‌కు శ్రీలత రెడ్డి రాజీనామా

నేరేడుచర్ల, వెలుగు:  సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ చల్లా శ్రీలత రెడ్డి బీఆర్‌‌ఎస్‌తో పాటు తన పదవికి రాజీనామా చేశారు. ఈ రాజీనామాను బుధవారం మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డికి అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వ్యక్తిగత కారణాలతో పార్టీని వీడుతున్నట్లుతెలిపారు. శ్రీలత రెడ్డి త్వరలో బీజేపీకి చేరనున్నట్లు తెలిసింది. వచ్చే ఎన్నికల్లో హుజర్ నగర్ నుంచి పోటీ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.