Srimukhi: పొరపాటు జరిగింది క్షమించండి అంటూ సారీ చెప్పిన యాంకర్ శ్రీముఖి..

Srimukhi: పొరపాటు జరిగింది క్షమించండి అంటూ సారీ చెప్పిన యాంకర్ శ్రీముఖి..

టాలీవుడ్ ప్రముఖ యాంకర్ శ్రీముఖి సోషల్ మీడియా వేదికగా క్షమాపణలు తెలియజేసింది. ఇందులోభాగంగా ఓ వీడియోని కూడా రిలీజ్ చేసింది. ఇందులో రీసెంట్ గా తాను యాంకరింగ్ చేసిన ఓ సినిమా ఈవెంట్ లో రామలక్షణులని ఫ్రిక్షన్ స్టోరీ అంటూ పొరపాటున అన్నానని తెలిపింది. దీంతో హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయని అందుకుగాను క్షమించాలని కోరింది.

అలాగే తనకి కూడా రాముడంటే చాలా ఇష్టమని అందుకే నిత్యం భక్తిశ్రద్దలతో కొలుస్తానని కానీ అనుకోకుండా పొరపాటున ఇలా జరిగిందని ఇక నుంచి ఇలాంటి పొరపాట్లు జరగకుండా చూసుకుంటానని దయచేసి క్షమిస్తారని ఆశిస్తున్నట్లు తెలిపింది.

అయితే ఇంతకీ అసలు విషయం ఏమిటంటే యాంకర్ శ్రీముఖి ఇటీవలే నిజామాబాద్ లో జరిగిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి హోస్ట్ చేసింది. ఇందులో భాగంగా నిర్మాతలు దిల్ రాజు, శిరీష్ ని పొగిడేందుకు ఏకంగా రామలక్ష్మణులు ఫిక్షనల్ క్యారెక్టర్స్  అనేది మనం అప్పట్లోనే విన్నాం. 

ALSO READ | పుష్ప లో బ‌న్నీ దొంగే క‌దా.. మ‌హాత్ముడు కాదు క‌దా.?: రాజేంద్ర ప్రసాద్

కానీ, సాక్ష్యాత్తు రామలక్ష్మణులు నా కళ్ళముందు కూర్చున్నారు ఒకరు దిల్ రాజు.. ఇంకొకరు శిరీష్” అని చెప్పుకొచ్చింది. దీంతో కొందరు నెటిజన్లు సోషల్ మీడియాలో శ్రీముఖిని ఏకిపారేస్తున్నారు. క్షమాపణలు చెప్పలని లేదంటే కఠిన చర్యలు తీసుకుంటామని కామెంట్లు చేస్తున్నారు. దీంతో శ్రీముఖి సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ సారీ చెప్పింది.