
హైదరాబాద్, వెలుగు: శ్రీనిధి డెక్కన్ ఫుట్ బాల్ క్లబ్ కొత్త భవనం ‘డెక్కన్ ఎరీనా’ను ఆలిండియా ఫుట్ బాల్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ కళ్యాణ్ చౌబే శనివారం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ తమ కాలంలో మంచి ఫుట్ బాల్ పిచ్ లపై ఆడటానికి చాలా కష్టపడ్డామన్నారు. కొన్నిసార్లు అది తమ ఆటస్థాయిని మరింత ప్రభావితం చేసిందని గుర్తుచేసుకున్నారు.
శ్రీనిధి డెక్కన్ ఫుట్ బాల్ క్లబ్లో అత్యున్నత స్థాయి మౌలిక సదుపాయాలను చూస్తుంటే భవిష్యత్ బాగుంటుందనే ఆశ కలుగుతుందన్నారు. శ్రీనిధి ఎడ్యుకేషనల్ గ్రూప్, ఎస్‌డీఎఫ్‌సీ చైర్మన్ డా. కేటీ మహే, తెలంగాణా ఫుట్ బాల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మహ్మద్ అలీ రఫత్, టీఎఫ్‌ఏ సెక్రటరీ జీపీ పాల్గుణ, శ్రీనిధి ఇనిస్టిట్యూట్ సీఈవో అభిజిత్ రావ్ పాల్గొన్నారు.