- శ్రీనిధి కాలేజీలో స్టూడెంట్ల తల్లిదండ్రుల ఆందోళన
ఘట్కేసర్, వెలుగు: వర్సిటీ హోదా వస్తుందని చెప్పి శ్రీనిధి కాలేజీ మేనేజ్మెంట్ తమ పిల్లల జీవితాలను ఆగం జేసిందని, రూ. లక్షల్లో డొనేషన్లు వసూలు చేసి చేతులేత్తేసిందంటూ స్టూడెంట్ల తల్లిదండ్రులు ఆరోపించారు. సోమవారం మేడ్చల్ జిల్లా పోచారంలోని శ్రీనిధి ఇంజనీరింగ్ కాలేజీలో ఆందోళన చేపట్టారు. కాలేజీకి యూనివర్సిటీ హోదా రాకపోవడంతో తమ పిల్లల విద్యా సంవత్సరం వృథా అవుతుందంటూ ధర్నాకు దిగారు. కాలేజీ అద్దాలు, ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు.
మంత్రుల పేర్లు చెప్పి శ్రీనిధి కాలేజ్ మేనేజ్మెంట్ బెదిరింపులకు దిగుతోందని స్టూడెంట్ల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా శ్రీనిధి కాలేజీపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ యాక్షన్ తీసుకుని న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఆందోళన ఉద్రిక్తంగా మారడంతో కాలేజీ వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.