- శ్రీనిధి ఇంజినీరింగ్ కాలేజీలో విద్యార్థుల ఆందోళన
ఘట్ కేసర్, వెలుగు: శ్రీనిధి ఇంజినీరింగ్ కాలేజీలో గురువారం ఉద్రిక్తత నెలకొంది. ఫీజు రీయింబర్స్మెంట్ రాలేదని యాజమాన్యం తమకు హాల్ టికెట్లు ఇవ్వట్లేదని ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థులు ఆందోళన చేపట్టారు. ఫీజు రీయింబర్స్మెంట్ రాని పలువురు విద్యార్థులను బుధవారం క్యాంపస్ బయటే నిలిపివేశారని ఏబీవీపీ రాష్ట్ర నాయకుడు అంకం శ్యామ్ యాదవ్ ఆరోపించారు.
రీయింబర్స్ మెంట్తో సంబంధం లేకుండా విద్యార్థులతో పరీక్షలు రాయించాలని డిమాండ్ చేశారు. కాలేజీ యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. శ్రీనిధి విద్యాసంస్థల చైర్మన్ కె.టి.మహి విదేశాల్లో ఉన్నారని, ఆయన వచ్చిన తర్వాత ఏదైనా నిర్ణయం తీసుకుంటామని కాలేజీ ప్రిన్సిపల్ శివారెడ్డి తెలిపారు. అప్పటివరకు పరీక్షలను వాయిదా వేస్తామని చెప్పడంతో విద్యార్థులు ఆందోళన విరమించారు.