ఉమ్మడి నిజామాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు

నిజామాబాద్, వెలుగు: అంగవైకల్యం ఉన్నా ఆత్మవిశ్వాసంతో ముందు సాగే వారు చాలా అరుదు. అలాంటి వారు చరిత్రలో నిలిచిపోవడమే కాదు. ఎందరికో స్ఫూర్తినిస్తారు. అందులో ఒకరు ఇందూరుకు చెందిన కాశ్కట్‌‌‌‌ శ్రీనికేశ్‌‌‌‌.. నిజామాబాద్‌‌‌‌ జిల్లా కేంద్రంలోని గౌతమ్ నగర్ కాలనీకి చెందిన కిరణ్, భారతి కుమారుడైన శ్రీనికేశ్‌‌కు పుట్టుకతో రెండు చేతులు లేవు. కానీ అతడికి ఆటలంటే చాలా ఇష్టం. చదువుకుంటూనే స్విమ్మింగ్‌‌‌‌పై దృష్టి పెట్టాడు. ప్రస్తుతం బెంగళూరు కేంద్రీయ విద్యాలయంలో 9వ తరగతి శ్రీని కేశ్‌‌‌‌  ఇటీవల గౌహతిలో జరిగిన 22వ జాతీయ పారా స్విమ్మింగ్ పోటీల్లో తెలంగాణ రాష్ట్రం తరుఫున ప్రాతినిధ్యం వహించాడు. మూడు విభాగాల్లో పతకాలు తెచ్చాడు. జాతీయ స్థాయిలో 400 మీటర్ ఫ్రీ స్టైల్, 50 మీటర్ ఫ్రీ స్టైల్ బ్యాక్ స్టోక్‌‌‌‌లో రెండు బంగారు పతకాలు, 50 మీటర్ బేస్ట్ స్టోక్‌‌‌‌లో మరో వెండి పతకం సాధించారు. మూడేళ్లుగా స్విమ్మింగ్‌‌‌‌లో రాణిస్తున్న తనకు అంతర్జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనాలనేది కోరిక అంటున్నాడు. ఇందుకు దాతలు ఆర్థికంగా సహకరించాలని కోరుతున్నాడు.
 

సిద్దాపూర్‌‌‌‌‌‌‌‌ ప్రాజెక్ట్‌‌‌‌తో 30 వేల ఎకరాలకు సాగునీరు

వర్ని, వెలుగు: సిద్దాపూర్‌‌‌‌‌‌‌‌ రిజర్వాయర్‌‌‌‌‌‌‌‌ నిర్మాణం పూర్తయితే సుమారు 30 వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని స్పీకర్‌‌‌‌‌‌‌‌ పోచారం శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌రెడ్డి పేర్కొన్నారు. వర్ని మండలం సిద్దాపూర్ వద్ద కొత్తగా నిర్మిస్తున్న రిజర్వాయర్ పనులను గురువారం ఆయన పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ బాన్సువాడ నియోజకవర్గంలోని లక్ష ఎకరాలు నిజాంసాగర్ ఆయకట్టు పరిధిలో ఉందని, మిగిలిన మెట్ట ప్రాంతంలోని భూములకు సాగునీరు అందించేందుకు రూ.120 కోట్లతో సిద్దాపూర్ రిజర్వాయర్, రూ.106 కోట్లతో జాకోర - చందూరు ఎత్తిపోతల పథకాలను నిర్మిస్తున్నామని చెప్పారు. సిద్దాపూర్‌‌‌‌‌‌‌‌ రిజర్వాయర్‌‌‌‌‌‌‌‌ పనులు వచ్చే జూన్ నాటికి పూర్తి చేయాలని అధికారులు, కాంట్రాక్టర్‌‌‌‌‌‌‌‌కు సూచించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ హరిదాసు, ఎంపీపీ మేక శ్రీలక్ష్మి, టీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌ మండల కన్వీనర్‌‌‌‌‌‌‌‌ ‌‌‌‌గిరి పాల్గొన్నారు.
 

10వ రోజూ సాగిన పాదయాత్ర

వేల్పూర్, వెలుగు: బీజేపీ నేత డాక్టర్‌‌‌‌‌‌‌‌ ఏలేటి మల్లికార్జున్‌‌‌‌రెడ్డి చేపట్టిన జనంతో మనం పాదయాత్ర పదో రోజుకు చేరుకుంది. గురువారం వేల్పూర్‌‌‌‌ మండలం కుకునూర్‌‌‌‌ ‌‌‌‌‌‌‌‌గ్రామం నుంచి ‌‌‌‌అంక్సాపూర్‌‌‌‌ వరకు యాత్ర సాగింది. ఈ సందర్భగా ఆయనకు కార్యకర్తలు, గ్రామ ప్రజలు మంగళహారతులతో స్వాగతం పలికారు. కోరుట్ల నియోజకవర్గ ఇన్‌‌‌‌చార్జి వెంకట్‌‌‌‌, నియోజకవర్గ నాయకులు సురభి నవీన్‌‌‌‌కుమార్‌‌‌‌, నిజామాబాద్ పార్లమెంట్‌‌‌‌ కో-కన్వీనర్‌‌‌‌ గుంటుక సదాశివం యాత్రకు మద్దతు తెలిపారు. అంక్సాపూర్‌‌‌‌‌‌‌‌లో ప్రజలను ఉద్దేశించి మల్లికార్జున్‌‌‌‌రెడ్డి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మిషన్ భగీరథలో పెద్ద మొత్తంలో అవకతవకలు జరిగాయని ఆరోపించారు. తెలంగాణ వస్తే ఇంటికో ఒక ఉద్యోగం వస్తుందన్న కేసీఆర్‌‌‌‌‌‌‌‌ తన కుటుంబ సభ్యులందరికీ ఉద్యోగాలు తెచ్చుకున్నాడు. మనకు మాత్రం గొర్రెలు, బర్రెలు ఇచ్చి బతకండని చెబుతున్నాడని విమర్శించారు.  పాదయాత్రలో బాల్కొండ అసెంబ్లీ కన్వీనర్ మల్కన్నగారి మోహన, జిల్లా వైస్ ప్రెసిడెంట్ నిమ్మల శ్రీనివాస్, వెల్పూర్‌‌‌‌ మండల ప్రెసిడెంట్ రమేశ్‌‌‌‌ పాల్గొన్నారు.

ఫ్రెండ్లీ పోలిసింగ్‌‌పై అవగాహన

నిజామాబాద్ రూరల్, వెలుగు: నిజామాబాద్ మండలం మల్కాపూర్​(టీ) గ్రామంలో గురువారం ఫ్రెండ్లీ పోలీసింగ్‌‌‌‌పై అవగాహన సదస్సు నిర్వహించారు. రూరల్ పోలీస్ స్టేషన్​ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సదస్సులో పాల్గొన్న ఎస్‌‌‌‌హెచ్‌‌‌‌వో లింబాద్రి రోడ్డు భద్రత, ప్రమాదాల నివారణ, మత్తు పదార్థాలు గంజాయి వల్ల కలిగే నష్టాలు తదితర అంశాలపై అవగాహన కల్పించారు. గ్రామాల్లో శాంతి భద్రతల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించాలని కోరారు.

విద్యార్థులు నాయకత్వ లక్షణాలు పెంచుకోవాలి

నవీపేట్‌‌‌‌, వెలుగు: విద్యార్థి దశ నుంచే నాయకత్వ లక్షణాలు అలవర్చుకోవాలని రోటరీ క్లబ్ మాజీ అధ్యక్షుడు ఆకుల అశోక్ సూచించారు. మండలంలోని జన్నేపల్లి ఎస్ఎస్ఆర్ సెకండరీ స్కూల్‌‌‌‌లో జరిగిన ఇంటరాక్ట్ ప్రోగ్రామ్‌‌‌‌లో ఆయన పాల్గొని మాట్లాడారు. స్టూడెంట్లు సేవాగుణం అలవర్చుకోవాలన్నారు. కార్యక్రమంలో డాక్టర్ విశాల్ ఆకుల, ఇన్‌‌‌‌చార్జి కార్యదర్శి విజయరావు, జ్ఞానప్రకాశ్‌‌‌‌, రామకృష్ణ, జుగల్ సోనీ, బాబురావు, పార్సి రాజేశ్వర్, పాఠశాల చైర్మన్, రోటరీ సభ్యులు మారయ్యగౌడ్, శ్రీకాంత్ ఝావర్, గోవింద్ స్కూల్ ప్రిన్సిపాల్  భాస్కర్, టీచర్స్ నరేందర్, శ్రీనివాస్ పాల్గొన్నారు.

జెడ్‌‌‌‌ విధానంతో క్వాలిటీ ప్రొడక్ట్స్‌‌‌‌


కామారెడ్డి, వెలుగు: క్వాటిటీ ప్రొడక్ట్స్ ఉత్పత్తి చేయటానికి జెడ్ పక్రియ దోహదపడుతుందని కామారెడ్డి కలెక్టర్ జితేష్ వి పాటిల్ పేర్కొన్నారు. గురువారం కలెక్టరేట్‌‌‌‌లో జీరో డిఫెక్ట్స్‌‌‌‌పై మీటింగ్ జరిగింది. కలెక్టర్​ మాట్లాడుతూ సూక్ష్మ, చిన్న తరహా ఇండస్ట్రీస్‌‌‌‌లో జెడ్ సర్టిఫికెట్​కొత్త ఉత్పత్తుల పక్రియకు, మార్కెట్ విస్తరణకు ఉపయోగపడుతుందన్నారు. జెడ్ కోఆర్డినేటర్ నవీన్‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌  పలు ఆంశాలపై అవగాహన కల్పించారు. లీడ్ బ్యాంక్ మెనేజర్ రమేశ్,   జిల్లా ఇండస్ట్రియల్ ఆఫీసర్ లాలూనాయక్, మెప్మా పీడీ శ్రీధర్‌‌‌‌‌‌‌‌రెడ్డి తదితతరులు 
పాల్గొన్నారు.  


పోడు భూములపై గ్రామసభ

నవీపేట్, వెలుగు: మండలంలోని పలు గ్రామాల్లో పొడు భూముల లబ్ధిదారులఎంపికకు గ్రామసభలు నిర్వహించారు. గురువారం మద్దెపల్లిలో జరిగిన సభలో తహసీల్దార్ వీర్ సింగ్ మాట్లాడుతూ పోడు భూముల గుర్తింపు పట్టాలు ఇవ్వడానికి మిట్టపుర్, నందిగామ, మద్దెపల్లి మూడు గ్రామాల్లో 83 మంది లబ్ధిదారులను గుర్తించినట్లు చెప్పారు. గ్రామసభ తీర్మానాన్ని గవర్నమెంట్‌‌‌‌కు పంపి ఫారెస్ట్, రెవెన్యూ అధికారులతో కలిసి అర్హులైన వారికి పట్టాలు ఇస్తామన్నారు. కార్యక్రమంలో మద్దెపల్లి సర్పంచ్ రేణుక రవి, వైస్ ఎంపీపీ హరీశ్‌‌‌‌, ఫారెస్ట్ అధికారులు పాల్గొన్నారు .  

కోటగిరి మండలంలో...

కోటగిరి: పోడు భూములకు పట్టాలు ఇచ్చేందుకు ప్రభుత్వం చేస్తున్న సర్వేలో భాగంగా మండలంలోని సుద్దులం తండా, కొత్తపల్లిలో గ్రామసభ ఏర్పాటు చేశారు. ఈ మీటింగ్‌‌‌‌లో పట్టాల కోసం ఆన్‌‌‌‌ లైన్ దరఖాస్తు చేసుకున్న రైతుల వివరాలను తహసీల్దార్ శ్రీకాంత్‌‌‌‌రావు చదివి వినిపించారు. ఈ జాబితాను డివిజన్ అధికారులకు పంపుతున్నామని, వారే తుది నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. పోడు భూముల పట్టాల విషయంలో రైతులు ప్రభుత్వ అధికారులకు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీడీవో మారుతి, ఎస్సై మచ్చేందర్‌‌‌‌‌‌‌‌రెడ్డి , ఫారెస్ట్‌‌‌‌ బీట్ ఆఫీసర్ శివకుమార్ పాల్గొన్నారు.

 

​కంటి దవాఖానాను వినియోగించుకోండి

ఆర్మూర్, వెలుగు: ఆర్మూర్‌‌‌‌‌‌‌‌లో ఏర్పాటు చేసిన లయన్స్ కంటి హాస్పిటల్‌‌‌‌ను సద్వినియోగం చేసుకోవాలని లయన్స్ ప్రెసిడెంట్ చెన్న రవికుమార్ అన్నారు. గురువారం ఆర్మూర్‌‌‌‌‌‌‌‌లో నిర్వహించిన  శిబిరంలో 12 మందికి కంటి ఆపరేషన్లు చేశారు. రెండున్నర నెలల్లో లయన్స్ ద్వారా 70 మందికి ఆపరేషన్లు చేసినట్లు చెప్పారు. కార్యక్రమంలో లయన్స్​ ప్రతినిధులు ఉదయ్ కుమార్, అంబల్ల తిరుపతి, పద్మ నర్సయ్య, మ్యాక మోహన్‌‌‌‌దాస్‌‌‌‌,  డాక్టర్ భుజంగ్‌‌‌‌రెడ్డి పాల్గొన్నారు.


కాంగ్రెస్ వర్సెస్‌‌‌‌ టీఆర్ఎస్

 భిక్కనూరులో పోటాపోటీ నిరసనలు
 శాంతింప జేసిన పోలీసులు

భిక్కనూరు, వెలుగు: కాంగ్రెస్‌‌‌‌, టీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌ పార్టీ పోటాపోటీ నిరసనలతో భిక్కనూరు ఒక్కసారిగా వేడిక్కింది. ఒక దశలో ఇరు వర్గాలు ఘర్షణకు సిద్ధమయ్యాయి. పోలీసుల రంగ ప్రవేశం చేసి పరిస్థితిని చక్కదిద్దారు.. ధరణి సమస్యలపై పీసీసీ పిలుపు మేరకు మాజీ మంత్రి షబ్బీర్‌‌‌‌‌‌‌‌ అలీ నేతృత్వంలో గురువారం కాంగ్రెస్‌‌‌‌ లీడర్లు  తెలంగాణ చౌరస్తాలో ధర్నా చేపట్టారు. అదే సమయంలో టీఆర్ఎస్ లీడర్లు తమ పార్టీ వారు కాంగ్రెస్‌‌‌‌లో చేరకున్నా చేరారని ప్రచారం చేస్తున్నారని నిరసన దిగారు. ఇరు పార్టీల లీడర్లు చౌరస్తాలో ఆందోళనకు దిగడంతో పాటు ఒకరి ఒకరు నినాదాలు చేసుకున్నారు. ఒక దశలో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకోవాడంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి సముదాయించారు.  

న్యూట్రిషన్ ఫుడ్‌‌‌‌పై అవగాహన

ఎడపల్లి, వెలుగు: మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన అంగన్‌‌‌‌వాడీ టీచర్లకు న్యూట్రిషన్ ఫుడ్‌‌‌‌పై గురువారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఐసీడీఎస్‌‌‌‌ ప్రాజెక్టు ఆధ్వర్యంలో జరిగిన ఈ ప్రోగ్రామ్‌‌‌‌కు సీడీపీవో వినోద హాజరై మాట్లాడారు. న్యూట్రిషన్ ఫుడ్ తయారీ, పిల్లలకు అందించే విధానంపై వివరించారు. ఇందుకు సంబంధించిన యాప్‌‌‌‌లో నిత్యం వివరాలను నమోదు చేయాలని టీచర్లకు సూచించారు. కార్యక్రమంలో మండలంలోని అంగన్‌‌‌‌వాడీ టీచర్లు పాల్గొన్నారు 


ధరణి సమస్యపై కాంగ్రెస్‌‌‌‌ ధర్నా

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ.. ధరణిలో సమస్యలు పరిష్కరించాలని డిమాండ్​ చేస్తూ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఉమ్మడి నిజామాబాద్‌‌‌‌ జిల్లాలో ఆందోళనలు చేపట్టారు. టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్‌‌‌‌రెడ్డి పిలుపు మేరకు గురువారం జిల్లా కేంద్రాలు, మండలాల్లోని తహసీల్దార్‌‌‌‌‌‌‌‌ ఆఫీస్‌‌‌‌ ముందు బైఠాయించి నిరసన తెలిపారు. అనంతరం తహసీల్దార్లకు వినతి పత్రాలు అందజేశారు. కామారెడ్డిలో జరిగిన ఆందోళనల్లో మాజీ మంత్రి షబ్బీర్​అలీ, డీసీసీ ప్రెసిడెంట్ కైలాస్​ శ్రీనివాస్‌‌‌‌రావు పాల్గొన్నారు.    
- వెలుగు, నెట్‌‌‌‌వర్క్‌‌‌‌

సేంద్రియ పసుపు సాగుపై అవగాహన

ఎర్గట్ల, వెలుగు: మండల కేంద్రంలోని రైతు వేదికలో ఆచార్య కొండ లక్ష్మణ్ అగ్రికల్చర్ యూనివర్సిటీ వారి ఆధ్వర్యంలో అధిక కర్క్యూమీన్ పసుపు పంటలో సేంద్రియ సాగు అనే అంశంపై గురువారం రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా నాబార్డ్ డిప్యూటీ జనరల్ మేనేజర్ నాగేశ్‌‌‌‌ మాట్లాడుతూ పసుపులో మార్కెటింగ్ మెలకు వలను వివరించారు. కమ్మర్‌‌‌‌‌‌‌‌పల్లి పసుపు పరిశోధన కేంద్రం సైంటిస్ట్ బి,మహేందర్ రైతులకు పసుపు సాగులో  సేంద్రియ పద్ధతులను వివరించారు. సైంటిస్ట్ శ్రీనివాస్ పసుపు పంట కోత అనంతరం తీసుకోవాల్సిన యాజమాన్య పద్ధతులపై, స్పైస్ బోర్డ్ ద్వారా రైతులకు అందుతున్న పథకాలపై ఆ బోర్డ్ డైరెక్టర్ సుందరేశన్ మాట్లాడారు. ఉద్యానవన అధికారి సుమన్, అగ్రికల్చర్ ఆఫీసర్ అబ్దుల్ మాలిక్ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అందిస్తున్న పథకాలను వివరించారు. కార్యక్రమంలో ఐసీఐసీఐఎస్ ఫౌండేషన్ అధికారి కనకరాజు,  సొసైటీ చైర్మన్ నర్సయ్య పాల్గొన్నారు.


విద్యార్థుల్లో ప్రతిభను వెలికి తీయాలి

కామారెడ్డి, వెలుగు: ప్రతి స్డూడెంట్‌‌‌‌లో ఏదో ఒక ప్రతిభ ఉంటుందని, దీనిని టీచర్లు బయటకు తీయాలని  ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కూర రఘోత్తమ్‌‌‌‌రెడ్డి సూచించారు. కామా రెడ్డి విద్యానికేతన్​ హైస్కూల్‌‌‌‌లో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి సైన్స్​ఫేర్‌‌‌‌‌‌‌‌ను గురువారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశ అభివృద్ధి శాస్త్ర సాంకేతిక రంగాలతో ముడిపడి ఉంటుందన్నారు. అడిషనల్ కలెక్టర్ చంద్రమోహన్​ మాట్లాడుతూ ప్రతి విద్యార్థి శాస్త్రీయ దృక్పథంతో ముందుకు సాగాలన్నారు. జడ్పీ వైస్​చైర్మన్  ప్రేమ్‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌,  లైబ్రరీ జిల్లా చైర్మన్ పున్న రాజేశ్వర్, ఎంపీపీ పిప్పిరి ఆంజనేయులు, డీఈవో రాజు, అడిషనల్ ఎస్పీ అన్యోన్య, డీఎస్‌‌‌‌వో సిద్ధిరాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాగా, మూడు రోజుల పాటు నిర్వహించే ఈ సైన్స్‌‌‌‌ ఫేర్‌‌‌‌‌‌‌‌లో 510 ఎగ్జిబిట్లను ప్రదర్శిస్తున్నట్లు నిర్వాహకులు చెప్పారు.