ఉద్యోగం ఇప్పిస్తామని మోసం..బాధితుడు ఆత్మహత్యాయత్నం

ఉద్యోగం ఇప్పిస్తామని మోసం..బాధితుడు ఆత్మహత్యాయత్నం

పెద్దపల్లి జిల్లాలో ఆర్ఎఫ్సీఎల్ బాధితుడు శ్రీనివాస్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఆర్ఎఫ్సీఎల్ కంపెనీలో జాబ్ ఇప్పిస్తామని కొందరు వ్యక్తులు మోసం చేశారంటూ  గడ్డి మందు తాగాడు. స్థానికులు ఆయనను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆర్ఎఫ్సీఎల్ ఉద్యోగం కోసం దళారులకు 8 లక్షలు ఇచ్చినట్లు శ్రీనివాస్ సూసైడ్ నోట్ లో పేర్కొన్నాడు.  

ఆర్ఎఫ్సీఎల్ లో ఉద్యోగం ఇప్పిస్తామని.. నెలకు 40వేల జీతం వస్తుందని నమ్మించి..తూం తిరుపతి, తూం నర్సయ్య, తోట సంతోష్ సహా ఆరుగురికి 8లక్షలు ఇచ్చానని శ్రీనివాస్ తెలిపాడు. అప్పులు చేసి మరీ డబ్బులు ఇచ్చానని..అయితే వన్ ఇయర్ కాంట్రాక్ట్ ప్రాతిపదికన జాబ్ ఇప్పించారని వాపోయాడు. ఈ విషయం తెలిసి నిలదీస్తే వారు స్పందించడం లేదన్నారు. పోలీసులకు కంప్లైంట్ చేసిన ఫలితం లేదని.. దీంతో చనిపోవాలని నిర్ణయించుకున్నట్లు సూసైడ్ నోట్ లో రాశాడు.