ఏపీఓ జిల్లా అధ్యక్షుడిగా శ్రీనివాస్

బజార్​హత్నూర్, వెలుగు: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో అడిషనల్ ప్రోగ్రాం ఆఫీసర్( ఏపీఓ) కార్యవర్గాన్ని రాష్ట్ర అధ్యక్షుడు రజనీకాంత్ సమక్షంలో సోమవారం ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా జి. శ్రీనివాస్, ఉపాధ్యక్షుడిగా శామ్యూల్, కార్యదర్శిగా జుగది రావు, ట్రెజరరీ సంగీత, జనరల్ సెక్రెటరీలుగా మేఘమాల, నరేందర్, విజయ, సుభాషిని, జాకీర్ హుస్సేన్ ఎన్నికయ్యారు. కొత్తగా ఎన్నికైన కమిటీ సభ్యులకు ఉపాధి హామీ సిబ్బంది, పలువురు అధికారులు, నాయకులు శుభాకాంక్షలు తెలిపారు.