లింగంపేట, వెలుగు : జీపీ ట్రాక్టర్ బోల్తాపడి శ్రీనివాస్(25) అనే యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన ఆదివారం లింగంపేట మండలం నల్లమడుగు పెద్దతండాలో జరిగింది. ఎస్ఐ చైతన్య కుమార్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం శ్రీనివాస్హరితహారం చెట్ల కోసం ట్రాక్టర్ట్యాంకర్లో నీటిని నింపుకుని వస్తున్నాడు.
మూలమలుపు వద్ద ట్రాక్టర్ఒక్కసారిగా బోల్తా పడింది. దీంతో శ్రీనివాస్ అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడికి భార్య కావేరి, కొడుకులు శ్రీఆదిత్య, శ్రీహాన్ ఉన్నారు. మృతుడి తండ్రి దూద్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు నిర్వహిస్తున్నారు.