హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్ సీ ఏ)లో అవినీతి పెరిగిపోయిందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అందులోని పలు సెలక్షన్లలో అవకతవకలు జరుగుతన్నాయని ఆరోపించారు. ఈ విషయం ప్రభుత్వం దృష్టికి వచ్చిందన్నారు.
త్వరలో ఉప్పల్ స్టేడియం లీజ్ ముగిసిపోతోందని మంత్రి తెలిపారు. అనంతరం మళ్లీ ఆ స్టేడియానికి లీజ్ ఇచ్చే విషయంలో ప్రభుత్వం పునరాలోచిస్తుందని వెల్లడించారు. దానిని స్పోర్ట్స్ అథారిటీకి అప్పగిస్తామని వెల్లడించారు. వీటిపై త్వరలో నిర్ణయం తీసుకోనున్నట్లు చెప్పారు.