కోల్బెల్ట్, వెలుగు : ఉమ్మడి నల్గొండ–వరంగల్–ఖమ్మం జిల్లాల శాసనమండలి పట్టభద్రుల నియోజకవర్గ ఉప ఎన్నికకు కాంగ్రెస్ ఖమ్మం పార్లమెంట్ సెగ్మెంట్ కోఆర్డినేటర్ గా క్యాతనపల్లి మున్సిపాలిటీకి చెందిన శ్రీనివాస్ నియమితులయ్యారు.
టీపీసీసీ ఎలక్షన్ మెనేజ్మెంట్ కన్వీనర్ కపిలవాయి దిలీప్ కుమార్ నియామక ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 27న జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న గెలుపునకు కృషి చేస్తానని శ్రీనివాస్తెలిపారు.