శ్రీనివాస్ బ్లడ్ డొనేషన్ క్యాంపు

శ్రీనివాస్ బ్లడ్ డొనేషన్ క్యాంపు
  • కరీంనగర్ లో శ్రీనివాస్ మిత్రుల వినూత్న  ప్రోగ్రామ్ 

కరీంనగర్ టౌన్, వెలుగు: శ్రీనివాసు పేరు కలిగిన వ్యక్తుల ఆధ్వర్యంలో  కరీంనగర్ సిటీలోని టీటీడీ కళ్యాణమండంలో శ్రీనివాస్ మిత్రులు వినూత్న ప్రోగ్రామ్ ను ఆదివారం నిర్వహించారు. వాట్సాప్ అడ్మిన్ ఉట్కూరి శ్రీనివాస్ రెడ్డితో కలిసి పీటీసీ ఎస్పీ సుంకరి  శ్రీనివాస్ పాల్గొని బ్లడ్ డోనేషన్ క్యాంపును ప్రారంభించి మాట్లాడారు.  కరీంనగర్ జిల్లాతో పాటు హైదరాబాద్,  సిద్దిపేట, ఆదిలాబాద్, వరంగల్ నుంచి తరలివచ్చారు.

శ్రీనివాసులు పేరు కలిగిన 86 మంది రక్తదానం చేసినట్లు తెలిపారు.  వీరిలో నలుగురిని లక్కీ డ్రా ద్వారా ఎంపిక చేసి తిరుమల తిరుపతి దేవస్థానంలో బ్రేక్ దర్శనానికి తీసుకెళ్లనున్నట్టు పేర్కొన్నారు. కవి,రచయిత, సింగర్ నంది శ్రీనివాస్ ఏఐ సౌజన్యంతో రూపొందించిన శ్రీనివాస నామగీతాన్ని ఆవిష్కరించా రు. 

సంగీతం, గానం పూర్తిగా టెక్నాలజీని వినియోగించుకుని తయారు చేసినట్లు నంది శ్రీనివాస్ తెలిపారు. కార్యక్రమంలో గట్టు శ్రీనివాస్,  అవదూత శ్రీనివాస్,  ఇజ్జగిరి శ్రీనివాస్, దూస శ్రీనివాస్, పడమటింటి శ్రీనివాస్, కమటాల శ్రీనివాస్, పైడ శ్రీనివాస్, సామ శ్రీనివాస్, శ్రీనివాసులు.. ఇలా 700 మంది శ్రీనివాస్ లు.. పట్టణ ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు.