ఆరు గ్యారంటీలను పక్కా అమలు చేస్తాం : యెన్నం శ్రీనివాస్​ రెడ్డి

హన్వాడ/పాలమూరు, వెలుగు : పాలమూరును ఆగం చేసి అభివృద్ధి చేశామని చెప్పడానికి బీఆర్ఎస్​ లీడర్లకు సిగ్గు ఉండాలని మహబూబ్​నగర్​ కాంగ్రెస్​ అభ్యర్థి యెన్నం శ్రీనివాస్ రెడ్డి (వైఎస్​ఆర్​) అన్నారు.  గురువారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆయన హన్వాడ మండలంలోని లింగన్నపల్లి, వేపూర్, గొండ్యాల, రామన్నపల్లి, మాచర్ల తండాలో, సాయంత్రం శెట్టి కాంప్లెక్స్​, న్యూ టౌన్​, పాలకొండ ప్రాంతాల్లో పర్యటించారు.  

ఈ సందర్భంగా  మాట్లాడుతూ   ప్రతి గ్రామానికి నిధులు తెచ్చి అభివృద్ధి చేసి చూపిస్తానన్నారు. కాంగ్రెస్ ఆరు గ్యారంటీలను అమలు చేస్తుందని ఆయన హామీ ఇచ్చారు. తనను ఆశీర్వదించి ఓట్లు వేయాలని ఆయన కోరారు. కార్యక్రమంలో ఏఐసీసీ ఎన్నికల  అబ్జర్వర్ అతేష, లీడర్లు ఎన్​పీ వెంకటేశ్​, మారేపల్లి సురేందర్ రెడ్డి , మండల అధ్యక్షుడు టంకర కృష్ణయ్య  తదితరులు పాల్గొన్నారు.

ALSO READ : నా భవిష్యత్​ మీ చేతుల్లో ఉంది : ఆది శ్రీనివాస్