ఓట్లు అమ్ముకుంటే అంధకారమే: శ్రీనివాస్ రెడ్డి

ఓట్లు అమ్ముకుంటే అంధకారమే: శ్రీనివాస్ రెడ్డి

హన్వాడ, వెలుగు: స్వేచ్ఛగా ఓటు వేసుకోవాలని, ఓటును మందు, డబ్బుకు అమ్ముకుంటే భవిష్యత్  చీకటి మయమేనని కాంగ్రెస్  అభ్యర్థి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం మండలంలోని పెద్దదర్పల్లి గ్రామంలో బీఆర్ఎస్  నాయకులు, మాజీ సర్పంచ్  రామస్వామిగౌడ్, అరవండి యాదయ్యగౌడ్ ఆధ్వర్యంలో యెన్నం సమక్షంలో మాజీ ఎంపీపీ పల్లెని వెంకన్న, పెద్దరర్పల్లి ఎంపీటీసీ సమనెమ్మ, మాజీ సర్పంచ్ రామస్వామి, మాజీ ఉప సర్పంచ్  ప్రతాప్, 150 మంది నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ లో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇందిరాగాంధీ బ్యాంకులను జాతీయం చేసి బలహీనవర్గాల అభ్యున్నతి కోసం కృషి చేశారన్నారు.

పేద, బడుగు, బలహీనవర్గాలకు చెందిన వారికి బ్యాంకు రుణాలు ఇచ్చి గౌరవంగా జీవించేందుకు అవకాశం కల్పించారన్నారు. కాంగ్రెస్  పార్టీ ఏనాడు కుల, మత, ప్రాంతం, వర్గం చూడదని, కేవలం అభివృద్ధిని మాత్రమే చూస్తుందన్నారు. టీపీసీసీ ప్రధాన కార్యదర్శి సంజీవ్ ముదిరాజ్, డీసీసీ ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రి, పట్టణ అధ్యక్షుడు లక్ష్మణ్ యాదవ్, ఉమ్మడి జిల్లా గౌడ సంఘం అధ్యక్షుడు ఆనంద్ గౌడ్, పార్టీ సీనియర్  నాయకులు ఎన్పీ  వెంకటేశ్, సత్తూరు చంద్రకుమార్ గౌడ్, ఎస్సీ సెల్  చైర్మన్  సాయిబాబా పాల్గొన్నారు.

రేవంత్ సమక్షంలో చేరికలు

మద్దూరు: మండల కేంద్రానికి చెందిన పలువురు బీఆర్ఎస్  కార్యాకర్తలు ఆదివారం పీసీసీ చీఫ్  రేవంత్ రెడ్డి సమక్షంలో హైదరాబాద్ లోని ఆయన నివాసంలో కాంగ్రెస్  పార్టీలో చేరారు. రేవంత్  వారికి పార్టీ కండువా కప్పి కాంగ్రెస్​లోకి ఆహ్వానించారు. పార్టీకి అండగా ఉంటూ ఈసారి భారీ మెజార్టీతో  పార్టీ అభ్యర్థిని గెలిపించేదుకు కృషి చేయాలని కోరారు. పల్లెగడ్డ వెంకటయ్య, కుడుగుంట నర్సింలు, నిడ్జింత చందు, జీడీ ప్రకాశ్, మహిపాల్, గడ్డం రవి, మనోహర్,  ప్రకాశ్, రవికుమార్  పార్టీలో చేరిన వారిలో ఉన్నారు. అలాగే మండలంలోని పలు గ్రామాలకు చెందిన బీఆర్ఎస్  కార్యకర్తలు కొడంగల్ నియోజకవర్గ ఇన్​చార్జి తిరుపతి రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి ఆయన కండువా కప్పి కాంగ్రెస్ లోకి ఆహ్వానించారు.

రజాకర్ల పాలనను తరిమికొట్టాలి

అచ్చంపేట: రాష్ట్రంలో బీఆర్ఎస్  ప్రభుత్వ పనితీరు రజాకార్లను తలపిస్తోందని డీసీసీ అధ్యక్షుడు డాక్టర్  వంశీకృష్ణ పేర్కొన్నారు. ఆదివారం హైదరాబాద్​లోని మల్లాపూర్ లో అచ్చంపేట ప్రజల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థానికేతరుడైన గువ్వల బాలరాజ్  ప్రజలకు మాయమాటలు చెప్పి ఓట్లు వేయించుకొని గద్దెనెక్కిన తర్వాత, ఇక్కడి ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నాడని మండిపడ్డారు.

ALSO READ : నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తా: పద్మా దేవేందర్​రెడ్డి

ఇక్కడి నుంచి తరిమికొట్టేందుకు ప్రజలంతా జెండా, అజెండాలను పక్కనపెట్టి ఏకమయ్యారని తెలిపారు. చంద్రమోహన్, రమేశ్ రెడ్డి, గిరివర్ధన్ గౌడ్, పోశం, గణేశ్, నరసింహారావు, కట్ట అనంతరెడ్డి, సయ్యద్ జమీల్, రాజేశ్, లక్ష్మీనారాయణ, మాణిక్ బాబు, శంకరయ్య, ఖాజాబియా, మల్లయ్య, బాలస్వామి, బ్రహ్మచారి, కిశోర్, జహంగీర్ పాషా, షమీం పాషా పాల్గొన్నారు.