
కల్వకుర్తి, వెలుగు: పార్లమెంట్ ఎన్నికల కోసం 85 ఏండ్లు నిండిన వారు హోమ్ ఓటింగ్ కోసం దరఖాస్తు చేసుకోవాలని కల్వకుర్తి ఎన్నికల అధికారి శ్రీనివాస్ తెలిపారు. బుధవారం పట్టణంలోని ఆర్డీవో ఆఫీస్లో నియోజకవర్గంలోని ప్రజాప్రతినిధులతో సమావేశం నిర్వహించారు.
ఏప్రిల్ 15 వరకు ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోవాలన్నారు. సీనియర్ సిటిజన్స్, పీడబ్ల్యూడీ ఓటర్స్ ఫామ్ 12డీ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.