భారత్​మాల నేషనల్ హైవే - భూ నిర్వాసితుల సమస్యలు పరిష్కరించాలి : శ్రీనివాస్

భారత్​మాల నేషనల్ హైవే - భూ నిర్వాసితుల సమస్యలు పరిష్కరించాలి : శ్రీనివాస్

గద్వాల, వెలుగు: భారత్​మాల నేషనల్ హైవే నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతుల సమస్యలు పరిష్కరించాలని అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్ అన్నారు. బుధవారం కలెక్టరేట్ మీటింగ్ హాల్ లో రైతులు, నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఆఫీసర్ల తో మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా మీటింగ్ లో రైతుల సమస్యలను ఏకరువు పెట్టారు. రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఎన్ హెచ్ఎఐ ఆఫీసర్లకు సూచించారు.  

సూరత్ నుంచి చెన్నై వరకు వెళ్తున్న భారత్ మాల నేషనల్ హైవే జిల్లాలో 53 కిలోమీటర్ల వరకు ఉంటుందని, దీనివల్ల ఎంతో అభివృద్ధి జరుగుతుందన్నారు. రైతుల కోసం  బ్రిడ్జిలను నిర్మిస్తున్నట్టు తెలిపారు. ఏవైనా సమస్యలు ఉంటే తహసీల్దార్లల దృష్టి తీసుకొస్తే పరిష్కరిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్డీసీ సుబ్రహ్మణ్యం, ఏవో భద్రప్ప తదితరులున్నారు.