ఎలుకల దాడి బాధితుడు శ్రీనివాస్ మృతి

హైదరాబాద్: వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో ఎలుకలు కొరికిన ఘటనలో గాయపడ్డ శ్రీనివాస్ మృతి చెందాడు. హైదరాబాద్ నిమ్స్ హాస్పిటల్ లో రాత్రి 12గంటలకు చనిపోయినట్లు డాక్టర్లు తెలిపారు. నిన్న సాయంత్రం మెరుగైన వైద్యం కోసం శ్రీనివాస్ ను వరంగల్ ఎంజీఎం నుంచి హైదరాబాద్ లోని నిమ్స్ కు తరలించారు. అయితే  కిడ్నీ, కాలేయ వ్యాధులతో బాధపడుతున్న శ్రీనివాస్ చికిత్సకు సహకరించకపోవడంతో  తీవ్ర అస్వస్థతకు గురై మృతి చెందినట్లు డాక్టర్లు చెప్పారు. శ్రీనివాస్ మృతితో అతడి కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. కుటుంబ పెద్ద  మరణంతో  రోడ్డున పడ్డామని, ప్రభుత్వం తమను ఆదుకోవాలని శ్రీనివాస్ కుటుంబ సభ్యులు కోరుతున్నారు.

కాగా.. మార్చి 31న వరంగల్ లోని ఎంజీఎం హాస్పిటల్ లో ఓ పేషెంట్ పై ఎలుకలు దాడి చేసిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ ఘటనపై రాష్ట్ర సర్కారు సీరియస్ అయ్యింది. నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఎంజీఎం సూపరింటెండెంట్ ను బదిలీ చేయగా.. ఇద్దరి డాక్టర్లను సస్పెండ్ చేసింది. అలాగే నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఏజిల్ శానిటేషన్ సంస్థను బ్లాక్ లిస్ట్ లో పెట్టింది. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు శుక్రవారం ఎంజీఎం ఆసుపత్రిని సందర్శించి.. ఎలుకలు దాడి చేసిన వ్యక్తిని పరామర్శించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ లోని నిమ్స్ కు తరలించగా... చికిత్స పొందుతూ నిన్న అర్ధరాత్రి మృతి చెందాడు. 

మరిన్ని వార్తల కోసం...

కలలు గంటడు.. కన్నమేస్తడు

టార్గెట్​ టాప్​ సర్వీస్​