యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం వెంకంబావితండ గ్రామంలో విషాదం నెలకొంది. బండరాయి మీద పడి రమావతు శ్రీను(43) చనిపోయాడు. నిన్న రాచకొండలోని అడవికి కట్టెలు కొట్టడానికి వెళ్లి ఇంటికి రాలేదు.
దీంతో కుటుంబ సభ్యులు స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఇవాళ ఉదయం అడవిలో గాలించగా.. పెద్దబండ రాయి కింద శ్రీను డెడ్‌బాడీ లభ్యమైంది. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం చౌటుప్పల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.