ఉప్పునుంతల, వెలుగు : మండలంలోని దేవదారికుంట గ్రామానికి చెందిన ఇస్లావత్ శ్రీను నాయక్ కేంద్ర ఫిలిం సెన్సార్ బోర్డు సభ్యుడిగా నియమితులయ్యారు. శ్రీను నాయక్ బీజేపీ నేతగా, పార్టీ బలోపేతం కోసం కృషి చేశారు. ఆయన సేవలను గుర్తించి కేంద్ర ఫిల్మ్ సెన్సార్ బోర్డ్ మెంబర్ గా నియమించారు.
తనకు ఈ పదవి ఇచ్చినందుకు కేంద్ర నాయకత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. శ్రీను నాయక్‌కు పదవి రావడం పట్ల బీజేపీ జిల్లా కార్యదర్శి కుందేళ్ల సైదులు యాదవ్, మండల అధ్యక్షుడు వావిలాల రమేశ్, మండల ఉపాధ్యక్షుడు దుడ్డు ఎల్లయ్య యాదవ్, ప్రధాన కార్యదర్శులు బ్రహ్మ చారి, మహేశ్ యాదవ్, బీజేవైఎం ప్రధాన కార్యదర్శి చీమర్ల శివ, సన్నిహితులు ఆయనకు అభినందనలు తెలిపారు.