ట్రంప్ టీమ్​లో మరో ఇండో అమెరికన్.. ఏఐ అడ్వైజర్‎గా శ్రీరామ్ కృష్ణన్​

ట్రంప్ టీమ్​లో మరో ఇండో అమెరికన్.. ఏఐ అడ్వైజర్‎గా శ్రీరామ్ కృష్ణన్​

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ ఇండియన్ అమెరికన్, వెంచర్ క్యాపిటలిస్ట్ శ్రీరామ్ కృష్ణన్‎ను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అడ్వైజర్‎గా నియమించారు. ఈ మేరకు ట్రంప్ ఒక ప్రకటన విడుదల చేశారు. ఆయన ప్రభుత్వ ఏఐ విధానాన్ని రూపొందించడంతో  పాటు సమన్వయం చేయనున్నారని తెలిపారు. వైట్‌‌హౌస్‌‌ ఆఫీస్‌‌ ఆఫ్‌‌ సైన్స్‌‌ అండ్‌‌ టెక్నాలజీ పాలసీలో సీనియర్‌‌ సలహాదారుడిగా పనిచేయనున్నారని చెప్పారు. వైట్‌‌హౌస్‌‌ ఉన్నతాధికారి డేవిడ్‌‌ ఒ శాక్స్‌‌తో కలిసి ఆయన పని చేస్తారని వివరించారు.

 తనకు సలహాదారుడి పదవిని అప్పగించడంతో శ్రీరామ్‌‌ కృష్ణన్‌‌ స్పందిస్తూ కాబోయే అధ్యక్షుడికి కృతజ్ఞతలు తెలిపారు. శ్రీరామ్ కృష్ణన్ తమిళనాడు రాజధాని చెన్నైలో జన్మించారు. ఎస్ ఆర్ ఎమ్ ఇంజినీరింగ్ కాలేజి నుంచి ఐటీలో బీటెక్ పూర్తి చేశారు. 2005లో మైక్రోసాఫ్ట్‌‌లో  కెరీర్‌‌ ను ప్రారంభించారు. ఆ తర్వాత ఫేస్‌‌ బుక్‌‌, యాహూ, ట్విటర్‌‌, స్నాప్‌‌ వంటి సంస్థల్లో పనిచేశారు.