- శ్రీరామ్ మొబిలిటీ వెల్లడి
హైదరాబాద్: దేశవ్యాప్తంగా గత నెల కమర్షియల్వెహికల్స్(సీవీల)ల ధరలు పెరిగాయని శ్రీరామ్ మొబిలిటీ బులెటిన్ తెలిపింది. దీని రిపోర్ట్ ప్రకారం.. పండుగల కారణంగా ట్రక్కులకు డిమాండ్ బాగా పెరిగింది. యూజ్డ్ కమర్షియల్ వెహికల్స్ (యూసీవీల) ధరలు 4–7శాతం పెరిగాయి. అయితే సెడాన్లు, కాంపాక్ట్ ఎస్‌యూవీల్లో యూజ్డ్ ప్యాసింజర్ వెహికల్స్ ధరలు వార్షికంగా ఆరు శాతం నుంచి 10శాతం వరకు క్షీణించాయి. మారుతి స్విఫ్ట్ మారుతి ఎర్టిగా ధరలు 10శాతం తగ్గాయి. మహీంద్రా స్కార్పియో, హ్యుందాయ్ క్రెటా రీసేల్ ధరలు ఆరు శాతం తగ్గాయి.
పాత టూవీలర్ మోడల్స్ హోండా షైన్, బజాజ్ పల్సర్ వరుసగా 3శాతం, 2శాతం పడిపోయాయి. డిస్కౌంట్ల ఫలితంగా కొత్త వెహికల్స్ అమ్మకాలు ఊపందుకున్నాయి. జులైలో కార్ల అమ్మకాలు నెలవారీగా 11శాతం, వార్షికంగా 9శాతం పెరిగాయి. టూవీలర్స్ అమ్మకాలు నెలవారీగా 5శాతం పెరిగాయి.