కోదాడ, వెలుగు : సమాజ సేవలో ఆర్యవైశ్యులు ఎల్లప్పుడూ ముందుంటారని ఏపీలోని జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తెలిపారు. ఆదివారం కోదాడ పట్టణంలో జరిగిన ఆర్యవైశ్య ఆఫీషియల్ అండ్ ప్రొఫెషనల్ (అవోపా) 20వ వార్షికోత్సవంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. వైశ్యులు సామాజిక సేవా దృక్పథాన్ని కలిగి ఉంటారన్నారు. కోదాడలో రెండు దశాబ్దాలుగా అవోపా చేస్తున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమన్నారు. ఆర్యవైశ్య మహిళలు సేవారంగంతోపాటు రాజకీయ రంగంలో కూడా రాణించాలన్నారు. అవోపా అధ్యక్షుడు ఇమ్మడి రమేశ్ మాట్లాడుతూ 20 ఏండ్లుగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు.
విద్యానిధి ద్వారా ఏటా ఎంపిక చేసిన విద్యార్థులకు ఆర్థిక చేయూత అందిస్తున్నామని వివరించారు. తమ సంస్థ నుంచి వృద్ధులకు పింఛన్లు అందిస్తున్నట్లు తెలిపారు. ఈ ఏడాది 48 మంది విద్యార్థులకు విద్యానిధి నుంచి సహకారం అందించామని తెలిపారు. కార్యక్రమంలో అవోపా మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు వందనపు శిల్ప, రాష్ట్ర ఉపాధ్యక్షుడు చెన్నకేశవరావు, ఇమ్మడి రమేశ్, జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వరరావు, వంగవీటి లోకేశ్, బొగ్గరపు రామ్మూర్తి, చారుగుండ్ల రాజశేఖర్, ఓరుగంటి శ్రీనివాసరావు, స్వామి శ్రీనివాసరావు, గరినే కోటేశ్వరరావు, ఓరుగంటి ప్రభాకర్, గరినే శ్రీధర్, పెనుగొండ శ్రీనివాసరావు, పట్టణానికి చెందిన ఆర్యవైశ్యులు, వాసవి క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.