
హిందువులు.. పండుగలకు ఆచారాలకు.. సంప్రదాయాలకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. 2025 మార్చి 30న శ్రీవిశ్వావసు నామ సంవత్సరంలో ఉగాది పండుగను మార్చి 30న జరుపుకున్నాం. ఇక ఆ తరువాత ఏప్రిల్ 6 ఆదివారం శ్రీరామనమమి రోజున సాక్షాత్తు శ్రీహరి స్వరూపమైన.. శ్రీరామచంద్రుని.. తల్లి సీతాదేవి కళ్యాణం జరిపేందుకు సిద్దమవుతున్నాం. లోక కళ్యాణం కొసం జరిపే ఈ కళ్యాణం జరిపేందుకు పండితులు సూచిస్తున్న శుభముహూర్తం ఏమిటి.. తలంబ్రాలు ఏ సమయంలో సమర్పించాలో తెలుసుకుందాం. . .
శ్రీరామనవమి 2025 తేదీ మరియు శుభ ముహూర్తం
విశ్వావశు నామ సంవత్సరంలో శ్రీరామ నమవి పండుగను ఏప్రిల్ 6 వ తేదీ ఆదివారంశ్రీరామనవమిని జరుపుకుంటారు. పురాణాల ప్రకారం త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు ఆ రోజు జన్మించాడని పండితులు చెబుతుంటారు. కొన్ని ప్రాంతాల్లో ప్రాంతీయ ఆచారాన్ని బట్టి ఆ రోజు శ్రీరామచంద్రునితో పాటు దుర్గామాతను కూడా పూజించే సంప్రదాయం ఉంది.
Also Read :- జాతకాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి
హిందువులు అందరూ ప్రతి ఇంటిలో ఆరోజు శ్రీరామ చంద్రుని కళ్యాణం ఫొటోను ప్రతిష్టించి పూజలు చేసి.. వడపప్పు.. పానకం నైవేద్యంగా సమర్పించి .. ఆ తరువాత ప్రసాదంగా స్వీకరిస్తారు. ఇక ప్రతి వీధిలో కూడా రామ కళ్యాణం జరుపుతారు. భద్రాచలంలో ఎంతో వైభవంగా శ్రీరామనవమి ఉత్సవాలు జరుగుతాయి.
శ్రీరామనవమి శుభ ముహూర్తం:
- శ్రీరామనవమి తిథి ప్రారంభం: 2025 ఏప్రిల్ 5వ తేదీసాయంత్రం7:26
- శ్రీరామనవమి తిథి ముగింపు:2025 ఏప్రిల్ 6వ తేదీ సాయంత్రం 7:22
- ఏప్రిల్ 6వ తేదీ ఉదయం 11:08 నుండి మధ్యాహ్నం 1:39 వరకు .. . 2 గంటలు 31 నిమిషాలు.
- శ్రీరామచంద్రునికి.. సీతామాతకు తలంబ్రాలు సమర్పించే సమయం: ఏప్రిల్ 6వ తేదీ మధ్యాహ్నం 12:24
చైత్రమాస శుక్ల పక్ష నవమి తిథి నాడు రామచంద్రుడు జన్మించాడు. ప్రతి సంవత్సరం ఆ రోజును రామచంద్రుని జన్మదినంగా జరుపుకుంటారు. హిందూ కాలమానం ప్రకారం మధ్యాహ్నం రామచంద్రుడు జన్మించాడు. అయోధ్యలో రామనవమిని వైభవంగా జరుపుకుంటారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుండి భక్తులు అయోధ్యకు వస్తారు. సరయు నదిలో పవిత్ర స్నానం చేసిన తర్వాత భక్తులు ఆలయానికి వెళ్లి రామచంద్రుని దర్శనం చేసుకుంటారు.