దేవుళ్లలో శ్రీరాముడి స్థానం వేరు... ఎందుకంటే నిత్యం సత్యమే పలుకుతాడు.... హిందూ మతానికి చెందిన వారే కాకుండా అన్ని మతాల వారికి శ్రీరామచంద్రుడి గురించి తెలుసు....భక్తులు అమితమైన భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. ప్రతి ఏడాది చైత్రమాసం శుద్ద నవమి తిథి రోజున శ్రీరామనవమి పండుగ జరుపుకోనున్నారు. ఈ ఏడాది 17వ తేదీ బుధవారంజరుపుకోనున్నారు. శ్రీరామనవమి పండుగ వెనుక ఆసక్తికర శాస్త్రీయ కారణాలు ఉన్నాయి. అవేంటో ఇక్కడ ఇక్కడ తెలుసుకుందాం..
దేశవ్యాప్తంగా, భగవంతుడైన శ్రీరామనవమి పండుగను అత్యంత భక్తి, శ్రద్ధలతో నిర్వహిస్తుంటారు. ఆ రోజున ( ఏప్రిల్ 17) భారతదేశంలోని ప్రతి ఇంటిలోనూ తమవైన ఆచారాలను అనుసరిస్తూ విభిన్నమైన పిండివంటలు తయారుచేస్తుంటారు. తెలంగాణాలో విభిన్నమైన సంప్రదాయాలు మిళితం కావడంతో పాటుగా రామనవమి వేడుకలు చూపురులను సైతం కట్టిపడేస్తాయి.
వేసవి కాలం ప్రారంభం మొదట్లో శ్రీరామనవమి పండుగ జరుపుకుంటారు. నీటి కొరత, అధిక వేడి వంటి సమస్యలు ఈ సమయంలో మనుషుల్ని బాగా ఇబ్బంది పెడతాయి. అలాంటి సమయంలో, రామనామాన్ని జపిస్తూ వేడుకలో పాల్గొనడం వల్ల ప్రజలు ప్రశాంతతను పొందుతారు.
వేసవి సీజన్‌లో ఎండ వేడిమి పెరిగే వేళ జరిగే ఈ పండుగల వేళ కనిపించే క్యుసిన్‌లు మన శరీరంలోని వేడిని గ్రహించే రీతిలో ఉంటాయి. దక్షిణ భారతదేశంలో నీర్‌మోర్, పానకం, కొసాంబరీ వంటివి దేవునికి అర్పిస్తారు.
రామనవమి వేడుకలలో అత్యంత ఆసక్తికరమైన సమ్మర్ కూలర్‌గా పానకంను చెప్పాల్సి ఉంటుంది. ఈ పానకాన్ని నీరు, బెల్లం, మిరియాలు వంటి వాటితొ తయారుచేస్తారు. నీర్ మోర్ (దీనిని పలు చోట్ల పలు పేర్లతో పిలుస్తారు) అనేది మసాలాలతో కూడిన మజ్జిగ. దీనిని చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. పెసరపప్పుతో కొశాంబరి అనేది అతి సులభంగా జీర్ణమయ్యే సలాడ్.
దక్షిణ భారతదేశంలో ఈ రామనవమి వేడుకలలో కనిపించే మరో ఆసక్తికరమైన డిష్ సుందాల్. దీనిని రజ్మా లేదంటే గ్రీన్‌పీస్, కాలా చానాతో కలిపి తయారుచేప్తారు. ఉల్లిపాయ లేదంటే వెల్లుల్లి లేకుండా కొబ్బరి, మసాలాలు తో చేసే వేపుడు ఇది. దీని కోసం వినియోగించే నూనె ఖచ్చితంగా తేలికైనది, వాసనలేనటువంటిది కావాల్సి ఉంటుంది.
రామ నామం అనేది పవిత్రమైన నామం. దీనిని ఉచ్ఛరిస్తే చాలు. ..రామ నామాన్ని ఒక్క సారి ఉచ్చరించడం వల్ల ఇతర దేవుళ్ల పేర్లను వెయ్యి సార్లు ఉచ్చరించిన ఫలితం దక్కుతుందని శివుడు.. పార్వతీమాతకు చెప్పాడని బ్రహ్మాండ పురాణంలో చెప్పబడింది. రామనామ బలంతో బోయ వాడు వాల్మీకిగా మారి రామాయణం అనే గొప్ప గ్రంథాన్ని రచించాడు. శ్రీరామనవమి పండుగ పురస్కరించుకుని ఎవరైతే ఉపవాసం ఉంటారో వారు నవమి నాడు తమ ఉపవాసం ఉంటారు. వారు ప్రధానంగా పూని, కాలా చాలా, సూజీ హల్వా తింటారు. ఇక పండుగ వేళ కనిపించే స్వీట్లలో ఎల్లో మూంగ్ దాల్, బెల్లం, కొబ్బరి పాలతో పాయసం నుంచి శెనగపప్పు బూరెలు, బాదం హల్వా, కొబ్బరి లడ్డూలు వంటివి ఉంటాయి. ఆ రోజున ( ఏప్రిల్ 17) అనేక మంది భక్తులు ఉపవాసం ఉంటారు. వేసవి రోజుల్లో కరువును తట్టుకునేందుకు ఈ ఆచారం ఉపయోగపడనుంది. ఈ పండుగ రోజున చేసే ఉపవాసం రోగనిరోధక శక్తిని కూడా బలపరుస్తుంది. దాని వలన ఎలాంటి వ్యాధులు రావని శాస్త్రీయ నిపుణులు చెబుతున్నారు.