శ్రీ రామ నవమి : ఇంట్లో శ్రీరామనవమి వేడుక చేస్తున్నారా.. అయితే సీతారామచంద్ర స్వామి పూజ విధానం ఇదే..!

 శ్రీ రామ నవమి :  ఇంట్లో  శ్రీరామనవమి వేడుక చేస్తున్నారా.. అయితే  సీతారామచంద్ర స్వామి పూజ విధానం ఇదే..!

శ్రీ మహా విష్ణువు యొక్క ఏడవ అవతారం గా భూమి మీద చైత్ర శుద్ధ నవమి రోజున  ( 2025 ఏప్రిల్​ 6) మధ్యాహ్నము అభిజిత్తు లగ్నంలో రామచంద్రుడు కర్కాటకరాశి లో జన్మించాడు. చైత్ర శుద్ధ నవమి రోజున శ్రీ రామనవమి పండుగగా జరుపుకొంటూ శ్రీ సీతా రామ కళ్యాణం మహోత్సవాన్ని చేస్తాము.శ్రీరామనవమి పండుగ రోజున శ్రీ సీతారామచంద్ర స్వామిని ఇంట్లో ఎలా పూజించాలి..  ఏవిధంగా జరుపుకోవాలో మంత్ర పూర్వకంగా తెలుసుకుందాం. . .

ఈ సంవత్సరం శ్రీ రామనవమి పండుగ 06 వ తేదీ ఏప్రిల్ ఆదివారం రోజున వచ్చినది. ఈ మహా పర్వదినము రోజున రామపట్టాభిషేకంలో పాల్గొన్నా, శ్రీ సీతారామ కల్యాణం చేయించుకొన్నా లేక రామచంద్ర మూర్తిని పూజించినా సమస్త అభిష్టములు నెరవేరుతాయని ప్రతీతి.

శ్రీ పసుపు గణపతి పూజ:


శ్లో || శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం
ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే
దీపత్వం బ్రహ్మరూపో సి జ్యోతిషాం ప్రభురవ్యయః
సౌభాగ్యం దేహి పుత్రాంశ్చ సర్వాన్ కామాంశ్చదేహిమే
(దీపము వెలిగించి దీపపు కుందెకు గంధము,కుంకుమబొట్లు పెట్టవలెను.)

శ్లో || అగమార్ధం తు దేవానాం గమనార్ధం తు రక్షసాం
కురుఘంటారవం తత్ర దేవతాహ్వాన లాంఛనమ్
(గంటను మ్రోగించవలెను)

ఆచమనం : ఓం కేశవాయ స్వాహా,ఓం నారాయణాయ స్వాహా,ఓం మాధవాయ స్వాహా,(అని మూడుసార్లు ఆచమనం చేయాలి)

ఓం గోవిందాయ నమః
ఓం విష్ణవే నమః,
ఓంమధుసూదనాయ నమః, ఓంత్రివిక్రమాయ నమః,
ఓంవామనాయ నమః,ఓం శ్రీధరాయ నమః,
ఓంఋషీకేశాయ నమః, ఓంపద్మనాభాయ నమః,
ఓందామోదరాయ నమః, ఓంసంకర్షణాయ నమః,
ఓంవాసుదేవాయ నమః,ఓం ప్రద్యుమ్నాయ నమః,
ఓంఅనిరుద్దాయ నమః, ఓంపురుషోత్తమాయ నమః,
ఓంఅధోక్షజాయ నమః,ఓం నారసింహాయ నమః,
ఓంఅచ్యుతాయ నమః, ఓంజనార్ధనాయ నమః,
ఓంఉపేంద్రాయ నమః, ఓంహరయే నమః,
శ్రీ కృష్ణాయ నమః.. శ్రీకృష్ణ పరమబ్రహ్మణే నమ:
శ్రీ సీతారామ ..లక్ష్మణ.... భరత.. శతృఘ్న సమేత ఆంజనేయస్వామి దేవతాభ్యోం నమ:

యశ్శివో నామరూపాభ్యాం యాదేవీ సర్వమంగళా
తయోః సంస్మరణాత్ పుంసాం సర్వతో జయమంగళమ్ ||
లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవహః
యేషా మిందీవర శ్యామో హృదయస్థో జనార్థనః
ఆపదా మపహర్తారం దాతారం సర్వసంపదాం
లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహమ్ ||
సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధికే
శరణ్యే త్ర్యంబికే దేవి నారాయణి నమోస్తుతే ||

ఓంశ్రీ లక్ష్మీ నారాయణాభ్యాం నమః  ఓం శ్రీ ఉమామహేశ్వరాభ్యాం నమః
వాణీ హిరణ్యగర్బాభ్యాం నమః శచీపురందరాభ్యం నమః
అరుంధతీ వశిష్ఠాభ్యాం నమః శ్రీ సీతారామాభ్యాం నమః
నమస్సర్వేభ్యో మహాజనేభ్య నమః
అయం ముహూర్తస్సుముహోర్తస్తు
ఉత్తిష్ఠంతు భూతపిశాచా ఏతే భూమి భారకాః
ఏతేషా మవిరోధేనా బ్రహ్మకర్మ సమారభే ||
(ప్రాణాయామం చేసి అక్షతలు వెనుకకు వేసుకొనవలెను.)

ప్రాణాయామము: (కుడిచేతితో ముక్కు పట్టుకొని యీ మంత్రమును ముమ్మారు చెప్పవలెను)
ఓం భూః ఓం భువః ఓం సువః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్...ఓం అపోజ్యోతి రసోమృతం బ్రహ్మ భూర్బువస్సువరోమ్

సంకల్పం:

ఓం మమోపాత్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్ధం శుభే, శోభ్నే, ముహూర్తే, శ్రీ మహావిష్ణో రాజ్ఞాయా ప్రవర్తమానస్య అద్యబ్రహ్మణః ద్వితీయ పరార్ధే, శ్వేత వరాహకల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే, భరతఖండే మేరోర్ధక్షిణదిగ్భాగే, శ్రీశైలశ్య ఈశాన్య (మీరు ఉన్న దిక్కును చెప్పండి) ప్రదేశే కృష్ణ/గంగా/గోదావర్యోర్మద్యదేశే (మీరు ఉన్న ఊరికి ఉత్తర దక్షిణములలో ఉన్న నదుల పేర్లు చెప్పండి) అస్మిన్ వర్తమాన వ్యావహారిక చంద్రమాన శ్రీవిశ్వవశునామ సంవత్సరే.. వసంత ఋతౌ చైత్ర మాసే శుక్ల  పక్షే నవమ్యాం  .. భాను వాసరే ..  పునర్వశు  శుభ నక్షత్రే..  శుభయోగే, శుభకరణే. ఏవం గుణ విశేషణ విషిష్ఠాయాం, శుభతిథౌ,శ్రీమాన్ (మీ గోత్రము) గోత్రస్య (మీ పూర్తి పేరు) నామధేయస్య, ధర్మపత్నీ సమేతస్య అస్మాకం సహకుటుంబానాం క్షేమ, స్థైర్య, ధైర్య, విజయ, అభయ,ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్యర్థం, ధర్మార్ద, కామమోక్ష చతుర్విధ ఫల,పురుషార్ధ సిద్ద్యర్థం, ధన,కనక,వస్తు వాహనాది సమృద్ద్యర్థం, పుత్రపౌత్రాభివృద్ద్యర్ధం, సర్వాపదా నివారణార్ధం, సకల కార్యవిఘ్ననివారణార్ధం,సత్సంతాన సిధ్యర్ధం, పుత్రపుత్రికానాం సర్వతో ముఖాభివృద్యర్దం, ఇష్టకామ్యార్ధ సిద్ధ్యర్ధం, శ్రీమత్ క్షీరాబ్దిశయన దేవతా ముద్దిశ్య శ్రీ క్షీరాబ్ధిశయన దేవతా ప్రీత్యర్ధం యావద్బక్తి ధ్యాన,వాహనాది షోడశోపచార పూజాం కరిష్యే

(అక్షతలు నీళ్ళతో పళ్ళెములో వదలవలెను.)

తదంగత్వేన కలశారాధనం కరిష్యే.. కలశారాధనం:

శ్లో || కలశస్యముఖే విష్ణుః కంఠేరుద్ర స్సమాశ్రితః
మూలే తత్రోస్థితోబ్రహ్మా మధ్యేమాతృగణా స్మృతాః
కుక్షౌ తు సాగరా స్సర్వే సప్తద్వీపా వసుంధరా
ఋగ్వేదోథ యజుర్వేద స్సామవేదోహ్యథర్వణః
అంగైశ్చ సహితాస్సర్వే కలశాంబు సమాశ్రితాః
(కలశపాత్రకు గంధము,కుంకుమబొట్లు పెట్టి పుష్పాక్షతలతో అలంకరింపవలెను.కలశపాత్రపై కుడి అరచేయినుంచి ఈ క్రింది మంత్రము చదువవలెను.)

శ్లో || గంగేచ యమునే చైవ గోదావరి సరస్వతి
నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు
ఆయాంతు దేవపూజార్థం – మమ దురితక్షయకారకాః
కలశోదకేన పూజా ద్రవ్యాణి దైవమాత్మానంచ సంప్రోక్ష్య
(కలశములోని జలమును పుష్పముతో దేవునిపైనా పూజాద్రవ్యములపైన,తమపైన జల్లుకొనవలెను.తదుపరి పసుపు వినాయకునిపై జలము జల్లుతూ ఈ క్రింది మంత్రము చదువవలెను.)

మం || ఓం గణానాంత్వ గణపతి హవామహే కవింకవీనాముపమశ్రస్తవం
జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత అనశ్శృణ్వన్నూతిభి స్సీదసాదనమ్
శ్రీ మహాగణాధిపతయే నమః ధ్యాయామి,ఆవాహయామి,నవరత్న ఖచిత సింహాసనం సమర్పయామి
(అక్షతలు వేయవలెను)
శ్రీ మహాగణాధిపతయే నమః పాదయోః పాద్యం సమర్పయామి(నీళ్ళు చల్లవలెను)
శ్రీ మహాగణాధిపతయే నమః హస్తయోః ఆర్ఘ్యం సమర్పయామి(నీళ్ళు చల్లవలెను)
ముఖే శుద్దాచమనీయం సమర్పయామి శుద్దోదకస్నానం సమర్పయామి(నీళ్ళు చల్లవలెను)
శ్రీ మహాగణాధిపతయే నమః వస్త్రయుగ్మం సమర్పయామి(అక్షతలు చల్లవలెను)
శ్రీ మహాగణాధిపతయే నమః దివ్య శ్రీ చందనం సమర్పయామి(గంధం చల్లవలెను)
శ్రీ మహాగణాధిపతయే నమః అక్షతాన్ సమర్పయామి(అక్షతలు చల్లవలెను)

ఓం సుముఖాయ నమః,ఏకదంతాయ నమః,కపిలాయ నమః,గజకర్ణికాయ నమః,లంబోదరాయ నమః,వికటాయ నమః, విఘ్నరాజాయ నమః,గణాధిపాయ నమః,ధూమకేతవే నమః,గణాధ్యక్షాయ నమః, ఫాలచంద్రాయ నమః, గజాననాయ నమః, వక్రతుండాయ నమః,శూర్పకర్ణాయ నమః, హేరంబాయ నమః, స్కందపూర్వజాయ నమః, ఓం సర్వసిద్ది ప్రదాయకాయ నమః,మహాగణాదిపతియే నమః నానావిధ పరిమళ పత్ర పుష్పపూజాం సమర్పయామి. 

శ్రీ మహాగణాధిపత్యేనమః ధూపమాఘ్రాపయామి(అగరవత్తుల ధుపం చూపించవలెను.)
ఓం భూర్బువస్సువః ఓం తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్​ 
త్యంత్వర్తేన పరిషించామి అమృతమస్తు అమృతోపస్తరణమసి శ్రీ మహాగణాధిపతయే నమః గుడోపహారం నివేదయామి.(బెల్లం ముక్కను నివేదన చేయాలి)
ఓం ప్రాణాయస్వాహా, ఓం అపానాయస్వాహా, ఓం వ్యానాయ స్వాహాఓం ఉదానాయ స్వాహా, ఓం సమానాయ స్వాహా ,మధ్యే మధ్యే పానీయం సమర్పయామి.(నీరు వదలాలి.)
తాంబూలం సమర్పయామి, నీరాజనం దర్శయామి.(తాంబూలము నిచ్చి కర్పూరమును వెలిగించి చూపవలెను)


ఓం గణానాంత్వ గణపతిగ్ హవామహే కవింకవీనాముపమశ్రవస్తవం
జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత అనశ్శృణ్వన్నూతిభి స్సీదసాదనమ్శ్రీ
 మహాగణాదిపతయే నమః సువర్ణ మంత్రపుష్పం సమర్పయామి
ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి
అనయా మయా కృత యధాశక్తి పూజాయచ శ్రీ మహాగణాధిపతిః సుప్రీతః సుప్రసన్నో వరదో భవతు
(అనుకొని నమస్కరించుకొని, దేవుని వద్ద గల అక్షతలు ,పుష్పములు శిరస్సున ధరించవలసినది.)
(తదుపరి పసుపు గణపతిని కొద్దిగా కదిలించవలెను.)

శ్రీ మహాగణాధిపతయే నమః యధాస్థానం ముద్వాసయామి.

(శ్రీ మహాగణపతి పూజ సమాప్తం.)

ప్రాణప్రతిష్ఠాపన


అసునీతే పునర్స్మాసుచక్షుఃపునః ప్రాణమిహనో దేహిభోగం జ్యోక్పశ్యేమ సూర్యముచ్చరంత మనమతే మృడయానః స్వస్తి అమృతంవైప్రాణాః అమృతమాపః ప్రాణానేవ యధాస్థానముపహ్వయతే ఉపహితో భవ, స్థాపితోభవ, సుప్రసన్నోభవ, అవకుంఠితోభవ ప్రసీద ప్రసీద ప్రీతిగృహాణ యత్కించిత్ నివేదితం మయా|| తదంగ ధ్యానావాహనాది షోడశోపచారపూజాంకరిష్యే || అధ ధ్యానం.

 శ్రీ రామ నవమి సీతారామచంద్ర స్వామి పూజ విధానం 
పూర్వ సంకల్పిత శ్రీ సీతారామ చంద్ర పూజాం కరిష్యే — అని పూజారంభం చేయాలి.

ధ్యానం
వామేభూమిసుతా పురస్తుహనుమాన్ పశ్చాత్సుమిత్రా సుతః|
శత్రుఘ్నోభరతశ్చ పార్శ్వదళయోఃవాయ్వాది కోణేషుచ
సుగ్రీవశ్చ విభీషణశ్చ యువరాట్తారాసుతో జాంబవాన్|
మధ్యే నీలసరోజ కోమలరుచిం రామం భజే శ్యామలం.

శ్లో|| కందర్పకోటి లావణ్యం – మందస్మిత శుభేక్షణం
మహాభుజం శ్యామవర్ణం – సీతారామం భజామ్యహం
శ్రీసీతరామచంద్ర పరమాత్మనే నమః ధ్యానం సమర్పయామి

ఆవాహనం
శ్రీరామాగచ్ఛ భగవన్ – రఘువీర నృపోత్తమ
జానక్యా సహ రాజేంద్ర — సుస్థిరో భవసర్వదా. .. 

శ్లో|| రామచంద్ర మహేష్వాస – రావణాంతక రాఘవ
యావత్పూజాం సమాప్యేహం – తావత్త్వం సన్నిధిం కురు.

శ్లో|| రఘునాయక రాజర్షే – నమో రాజీవలోచన
రఘునందన మే దేవ – శ్రీరామాభిముఖో భవ
శ్రీసీతారామచంద్ర పరమాత్మనే నమః ఆవాహనం సమర్పయామి

సింహసనం
రాజాధిరాజ రాజేంద్ర – రామచంద్ర మహాప్రభో
రత్నసింహసనం తుభ్యం – దాస్యామి స్వీకురు ప్రభో||

శ్రీసీతారామచంద్ర పరమాత్మనే నమః నవరత్నఖచిత సింహసనం సమర్పయామి

పాద్యం
త్త్రెలోక్య పావనానంత – నమస్తే రఘునాయక
పాద్యం గృహణ రాజర్షే – నమో రాజీవలోచన
శ్రీసీతారామచంద్ర పరమాత్మనే నమః పాదయోః పాద్యం సమర్పయామి

అర్ఘ్యం
పరిపూర్ణ పరానంద – నమో రాజీవ లోచన
గృహణార్ఘ్యం మయాదత్తం – కృష్ణవిష్ణో జనార్దన
శ్రీసీతారామచంద్ర పరమాత్మనే నమః హస్తయోః అర్ఘ్యం సమర్పయామి

ఆచమనం
నమో నిత్యాయ శుద్ధాయ – బుద్ధాయ పరమాత్మనే
గృహాణాచమనం రామ – సర్వలోకైక నాయక!
శ్రీసీతారామచంద్ర పరమాత్మనే నమః ముఖే ఆచమనం సమర్పయామి

మధుపర్కం
నమః శ్రీవాసుదేవాయ – బుద్ధాయ పరమాత్మనే
మధుపర్కం గృహణేదం – రాజరాజాయతే నమః
శ్రీసీతారామచంద్ర పరమాత్మనే నమః మధుపర్కం సమర్పయామి

పంచామృతస్నానం
క్షీరం దధి ఘృతం చైవ – శర్కరా మధు సంయుతం
సిద్ధం పంచామృత స్నానం – రామ త్వం ప్రతిగృహ్యతాం
శ్రీసీతారామచంద్ర పరమాత్మనే నమః పంచామృత స్నానం సమర్పయామి

శుద్ధోదక స్నానం
బ్రహ్మాండోదర మధ్యస్థం – తీర్థైశ్చ రఘునందన
స్నాపయిష్యా మ్యహం భక్త్యా – సంగృహాణ జనార్ధన!
శ్రీసీతారామచంద్ర పరమాత్మనే నమః స్నానాంతరం ఆచమనీయం సమర్పయామి

వస్త్రం
సంతప్త కాంచన ప్రఖ్యం – పీతాంబర యుగం శుభం
సంగృహాణ జగన్నాథ – రామచంద్ర నమోస్తు తే
శ్రీసీతారామచంద్ర పరమాత్మనే నమః వస్త్రయుగ్మం సమర్పయామి
అనంతరం ఆచమనీయం సమర్పయామి. యజ్ఞోపవీతం సమర్పయామి

ఆభరణాని
కౌస్తుభాహార కేయూర – రత్న కంకణ నూపురాన్
ఏవమాదీ నలంకారాన్ – గృహాణ జగదీశ్వర!
శ్రీసీతారామచంద్ర పరమాత్మనే నమః ఆభరణాన్ సమర్పయామి

గంధం
కుంకుమాగరు కస్తూరీ – కర్పూరై ర్మిశ్ర సంభవమ్
తుభ్యం దాస్యామి దేవేశ – శ్రీ రామ స్వీకురు ప్రభో
శ్రీసీతారామచంద్ర పరమాత్మనే నమః శ్రీగంధం సమర్పయామి

పుష్పం
తులసీకుందమందార జాతీపున్నాగచంపకైః
నీలాంబుజైర్బిల్వదళైః పుష్పమాల్యైశ్చ రాఘవ!
పూజాయిష్యామ్యహం భక్త్యా సంగృహాణ జనార్దన
శ్రీ సీతారామచంద్ర పరమాత్మనే నమః నానావిధ పరిమళపత్ర పుష్పాణీ సమర్పయామి

వనమాలా
తులసీ కుంద మందార – పారిజాతాంబుజైర్యుతాం
వనమాలాం ప్రదాస్యామి – గృహణ జగద్వీశ్వర
శ్రీ సీతారామచంద్ర పరమాత్మనే నమః వనమాలాం సమర్పయామి

అథ అంగపూజా
శ్రీరామాయ నమః పాదౌ పూజయామి
శ్రీరామభద్రాయ నమః జంఘే పూజయామి
శ్రీరామచంద్రాయ నమః జానునీ పూజయామి
శ్రీశాశ్వతాయ నమః ఊరూన్ పూజయామి
శ్రీ రఘువల్లభాయ నమః కటిం పూజయామి
శ్రీ దశరథాత్మజాయ నమః ఉదరం పూజయామి
కౌసలేయాయ నమః నాభింపూజయామి
శ్రీ లక్ష్మణాగ్రాజాయ నమః వక్షస్థలం పూజయామి
శ్రీ కౌస్తుభాభరణాయ నమః కంఠం పూజయామి
శ్రీ రాజరాజాయ నమః స్కంధౌ పూజయామి
శ్రీ కోదండధరాయ నమః బాహూన్ పూజయామి
శ్రీ భరతాగ్రజాయ నమః ముఖం పూజయామి
శ్రీ పద్మాక్షాయ నమః నేత్రౌ పూజయామి
శ్రీ రమాయై నమః కర్ణౌ పూజయామి
శ్రీ సర్వేశ్వరాయ నమః శిరః పూజయమి
శ్రీ సీతారామచంద్ర పరబ్రహ్మాణే నమః సర్వాంణ్యంగాని పూజాయామి
తతః శ్రీ రామాష్టోత్తర శతనామా పూజాం కుర్యాత్

శ్రీరామ అష్ట్తోత్తర శతనామావళి

ఓం శ్రీరామాయ నమః
ఓం రామభద్రాయ నమః
ఓం రామచంద్రాయ నమః
ఓం శాశ్వతాయ నమః
ఓం రాజీవలోచనాయ నమః
ఓం శ్రీమతే నమః
ఓం రాజేంద్రాయ నమః
ఓం రఘుపుంగవాయ నమః
ఓం జానకివల్లభాయ నమః
ఓం జైత్రాయ నమః
ఓం జితామిత్రాయ నమః
ఓం జనార్ధనాయ నమః
ఓం విశ్వామిత్రప్రియాయ నమః
ఓం దాంతయ నమః
ఓం శరనత్రాణ తత్సరాయ నమః
ఓం వాలిప్రమదనాయ నమః
ఓం వంగ్మినే నమః
ఓం సత్యవాచే నమః
ఓం సత్యవిక్రమాయ నమః
ఓం సత్యవ్రతాయ నమః
ఓం వ్రతధరాయ నమః
ఓం సదాహనుమదాశ్రితాయ నమః
ఓం కోసలేయాయ నమః
ఓం ఖరధ్వసినే నమః
ఓం విరాధవధపందితాయ నమః
ఓం విభి ష ణపరిత్రాణాయ నమః
ఓం హరకోదండ ఖండ నాయ నమః
ఓం సప్తతాళ ప్రభేత్యై నమః
ఓం దశగ్రీవశిరోహరాయ నమః
ఓం జామదగ్న్యమహాధర్పదళనాయ నమః
ఓం తాతకాంతకాయ నమః
ఓం వేదాంత సారాయ నమః
ఓం వేదాత్మనే నమః
ఓం భవరోగాస్యభే షజాయ నమః
ఓం త్రిమూర్త యే నమః
ఓం త్రిగుణాత్మకాయ నమః
ఓం త్రిలోకాత్మనే నమః
ఓం త్రిలోకరక్షకాయ నమః
ఓం ధన్వినే నమః
ఓం దండ కారణ్యవర్తనాయ నమః
ఓం అహల్యాశాపశమనాయ నమః
ఓం పితృ భక్తాయ నమః
ఓం వరప్రదాయ నమః
ఓం జితేoద్రి యాయ నమః
ఓం జితక్రోథాయ నమః
ఓం జిత మిత్రాయ నమః
ఓం జగద్గురవే నమః
ఓం వృక్షవానరసంఘాతే నమః
ఓం చిత్రకుటసమాశ్రయే నమః
ఓం జయంత త్రాణవర దాయ నమః
ఓం సుమిత్రాపుత్ర సేవితాయ నమః
ఓం సర్వదేవాద్ దేవాయ నమః
ఓం మృత వానరజీవనాయ నమః
ఓం మాయామారీ చహంత్రే నమః
ఓం మహాదేవాయ నమః
ఓం మహాభుజాయ నమః
ఓం సర్వదే వస్తుతాయ నమః
ఓం సౌమ్యాయ నమః
ఓం బ్రహ్మణ్యాయ నమః
ఓం మునిసంస్తుతాయ నమః
ఓం మహాయోగినే నమః
ఓం మహొదరాయ నమః
ఓం సుగ్రీవే ప్సిత రాజ్యదాయ నమః
ఓం సర్వ పుణ్యాదేక ఫలినే నమః
ఓం స్మ్రుత స్సర్వోఘనాశనాయ నమః
ఓం ఆది పురుషాయ నమః
ఓం పరమపురుషాయ నమః
ఓం మహా పురుషాయ నమః
ఓం పుణ్యోద యాయ నమః
ఓం దయాసారాయ నమః
ఓం పురుషోత్తమాయ నమః
ఓం స్మితవక్త్త్రాయ నమః
ఓం అమిత భాషిణే నమః
ఓం పూర్వభాషిణే నమః
ఓం రాఘవాయ నమః
ఓం అనంత గుణ గంభీరాయ నమః
ఓం ధీరోదాత్త గుణోత్త మాయ నమః
ఓం మాయామానుషచారిత్రాయ నమః
ఓం మహాదేవాది పూ జితాయ నమః
ఓం సేతుకృతే నమః
ఓం జితవారాశియే నమః
ఓం సర్వ తీర్ద మయాయ నమః
ఓం హరయే నమః
ఓం శ్యామాంగాయ నమః
ఓం సుంద రాయ నమః
ఓం శూరాయ నమః
ఓం పీత వాసనే నమః
ఓం ధనుర్ధ రాయ నమః
ఓం సర్వయజ్ఞాధీపాయ నమః
ఓం యజ్వినే నమః
ఓం జరామరణ వర్ణ తాయ నమః
ఓం విభేషణప్రతిష్టాత్రే నమః
ఓం సర్వావగునవర్ణ తాయ నమః
ఓం పరమాత్మనే నమః
ఓం పరస్మై బ్రహ్మణే నమః
ఓం సచిదానందాయ నమః
ఓం పరస్మైజ్యోతి షే నమః
ఓం పరస్మై ధామ్నే నమః
ఓం పరాకాశాయ నమః
ఓం పరాత్సరాయ నమః
ఓం పరేశాయ నమః
ఓం పారాయ నమః
ఓం సర్వదే వత్మకాయ నమః
ఓం పరస్మై నమః
శ్రీరామ అష్టోత్తర శతనామావళీ సమాప్తం

ధూపం
వనస్పత్యుద్భవై ర్దివ్యై – ర్నానాగంధై స్సుసంయుతః
అఘ్రేయ స్సర్వదేవానాం – ధూపోయం ప్రతిగృహ్యతాం
శ్రీ సీతారామచంద్ర పరమాత్మనే నమః ధూపమాఘ్రాపయామి

దీపం
జ్యోతిషాం పతయే తుభ్యం – నమో రామాయా వేధసే
గృహాణ దీపకం రాజన్ – త్రైలోక్య తిమిరాపహం

నైవేద్యం (వడపప్పు.. పానకం.. ఇతర పదార్ధాలు)
విధి ప్రకారేణ నివేదనం కుర్యాత్, మధ్యే మధ్యే పానీయం సమర్పయామి.
అమృతాపి ధానమసి ఉత్తరాపొశనం సమర్పయామి. హస్తౌప్రక్షాళయామి ముఖే ప్రక్షాళనం సమర్పయామి. పాదౌ ప్రక్షాళయామి. శుద్ధాచమనీయం సమర్పయామి.

తాంబూలం
నాగవల్లీ దళైర్యుక్తం – ఫూగీఫల సమన్వితం
తాంబూలం గృహ్యతాం రామ కర్పూరాది సమన్వితం

నీరాజనం
మంగళం విశ్వకళ్యాణ – నీరాజన మిదం హరే
సంగృహాణ జగన్నాథ – రామభద్ర నమోస్తుతే

శ్రీ సీతారామచంద్ర పరమాత్మనే నమః నీరాజనం
దర్శయామి నీరాజనానంతరం ఆచమనీయం సమర్పయామి

మంత్రపుష్పం
నమో దేవాదిదేవాయ – రఘునాథాయ శారిఙ్గణే
చిన్మయానంద రూపాయ – సీతాయాః పతయే నమః
శ్రీ సీతారామచంద్ర పరమాత్మనే నమః
సువర్ణ దివ్యమంత్ర పుష్పం సమర్పయామి

ప్రదక్షిణ నమస్కారం
యానికానిచ పాపాని – జన్మాతర కృతానిచ
తాని తాని ప్రణశ్యంతి – ప్రదక్షిణ పదేపదే
పాపోహం పాపకర్మాహం – పాపాత్మా పాపసంభవః
త్రాహిమాం కృపయా దేవ – శరణాగత వత్సల!
అన్యధా శరణం నాస్తి – త్వమేవ శరణం మమ
తస్మాత్కారుణ్య భావేన – రక్షరక్ష రఘూత్తమ||
శ్రీ సీతారామచంద్ర పరమాత్మనే నమః
ఆత్మ ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి

పుష్పాంజలి
దాశరథాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి
తన్నో రామచంద్రః ప్రచోదయాత్
శ్రీ సీతారామచంద్ర పరమాత్మనే నమః పుష్పాంజలి సమర్పయామి

ఉత్తరపూజా
శ్రీజాంబవత్సుగ్రీవ హనుమత్ లక్ష్మణ భరతశత్రుఘ్న పరివార సహిత
శ్రీ సీతారామచంద్ర పరబ్రహ్మణే నమః
ఛత్రం ధారయామి – చామరం వీజయామి
గీతం శ్రావయామి – నృత్యం దర్శయామి
ఆందోళికా మారోహయామి – అశ్వ మారోహయామి
గజమారోహయామి – సమస్త రాజోపచార దేవ్యోపచార భక్త్యోపచార శక్త్యోపచార పూజాం సమర్పయామి

యస్యస్మృత్యా చ నామోక్త్యా – తపఃపూజా క్రియాదిషు
న్యూనం సంపూర్ణతాం యాతి – సద్యో వన్దే తమచ్యుతమ్!
యత్పూజితం మయా రామ! – పరిపూర్ణం తదస్తుతే

అనయా ధ్యానావాహనాది పూజయాశ్రీ సీతారామ చంద్ర దేవతా సుప్రీతా సుప్రసన్నా వరదా భవతు- (అని అక్షితలు నీళ్ళు విడిచిపెట్టి)హరిః తత్సత్. సర్వం శ్రీ సీతారామచన్ద్రార్పణమస్తు.. జైశ్రీరామ్​...ఓం స్వస్తి..