
తెలుగు సంవత్సరంలో శ్రీరామ నవమి పండుగరోజు హిందువులు ఎదురు చూస్తుంటారు. ఈ ఏడాది (2025) ఏప్రిల్ 6 వ తేదీన శ్రీరామనవమి వచ్చింది. ఆ రోజున శ్రీరాముడిని ప్రత్యేకంగా పూజిస్తారు. మర్యాద రాముడు.. పురుషోత్తమరాముడు.. శ్రీరామచంద్రుడు పుట్టిన రోజు కూడా అదేనని పురాణాల ద్వారా తెలుస్తుంది. ఆ రోజున శ్రీరామచంద్రుడిని కొన్ని నియమాలను పాటించి .. పూజించడం వలన జీవితంలో సుఖశాంతులు.. ఆనందం.. ఐశ్వర్యం లభిస్తాయని పండితులు చెబుతున్నారు. ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం. . .
రామాయణం పారాయణం.. సీతారాములకు పూజ: శ్రీరామనవమి రోజున ( ఏప్రిల్6) రామచరితమానస్.. రామరక్షా స్త్రోత్రం.. రామ నామాన్ని పఠించాలి. సీతారామచంద్రులకు . పసుపు.. కుంకుమ.. గంధం.. పుష్పాలు సమర్పించి.. పూజ చేసి..హారతి ఇవ్వడం.. పానకం.. వడపప్పు సమర్పించి.. భజనలు చేస్తే ప్రతికూల శక్తి నశించి.. ఇంట్లో.. ఆనందం .. శాంతి వాతావరణం నెలకొంటుందని పురాణాలు చెబుతున్నాయి.
అన్నదానం: శ్రీరాముడు ఇతరులకు సేవ చేయడం.. దానధర్మాల గురించి వివరించాడు. ప్రస్తుతం మనం నిత్యం చేయడం ఎవరికి సాధ్యపడదు కావున .. శ్రీరామనవమి రోజున పేదలకు ఆహారాన్ని పెట్టండి. అందుకే శ్రీరామనవమి ప్రతి పల్లెలో కూడాఅన్నదానం కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. దీనివలన ఐశ్వర్యంతో పాటు శ్రీరాముని ఆశీస్సులు కలుగుతాయని పండితులు చెబుతున్నారు.
దీపారాధన: శ్రీరామనవమి రోజున ఆలయంలోకాని..ఇంట్లోకాని తప్పకుండా దీపారాధన చేసి.. శ్రీరాముని కళ్యాణం ఫోటో ను ప్రతిష్టించి పూజ చేయాలి. దీపారాధన కాంతికి ఇంట్లో ప్రతికూల శక్తి తొలగి.. ఆనందం.. శ్రేయస్సు కలుగుతుంది.
తులసి మొక్కకు పూజ: తులసి మాత అంటే శ్రీ మహావిష్ణువుకు ఎంతో ఇష్టం... శ్రీరామచంద్రుడిని ... విష్ణువు అవతారంగా భావిస్తారు. శ్రీరామనమవి రోజున తులసి మొక్కకు పసుపు.. కుంకుమ... గంధం సమర్పించి..పూజ చేయాలి. తరువాత నీళ్లు పోసి .. తులసి మాత ( చెట్టు) చుట్టూ ప్రదక్షిణాలు చేయాలి. ఇలా చేస్తే పాపాలు నశించి.. ఐశ్వర్యం కలుగుతుందని పండితులు చెబుతున్నారు.
వస్త్రదానం: శ్రీరామనవమి రోజున పేదలకు దానం చేయాలని పండితులు చెబుతున్నారు. అవసరమైన వారికి బట్టలు .. ఇతర వస్తువులు ... బట్టలు, ఆహార పదార్థాలు, నీరు, పుస్తకాలు దానం చేయండి. ఇలా చేయడం వలన మంచి గుణాలు .. మంచి ఆలోచనలు రావడం.. జీవితంలో అన్ని అనుకూలంగా సాగిపోవడంతో పాటు అదృష్టం కూడా వరిస్తుందని పండితులు అంటున్నారు.
హనుమంతుడికి ప్రత్యేక పూజలు : శ్రీరామచంద్రుడికి.. హనుమంతుడు గొప్ప భక్తుడు.. ఆయన శివపరమాత్మ అంశకూడా.. రామ నామము ఎక్కడ ఉంటుందో.. అక్కడ హనుమంతుడు... ఆంజనేయస్వామికి ఎక్కడ పూజలు జరుగుతాయో.. అక్కడ శ్రీరామచంద్రుడు ఉంటారని శాస్త్రాల ద్వారా తెలుస్తుంది. అందుకే... శ్రీరామనవమి రోజున హనుమాన్ చాలీసా ... సుందరాకాండ పారాయణం చేస్తే చాలా మంచిది. జీవితంలో అన్ని రకాల సమస్యలను తొలగించడం.. భూత.. ప్రేత.. పిశాచ.. గాలి.. ధూళి వంటి భయాలనుండి రక్షణ కలుగుతుంది.
తల్లిదండ్రులు.. గురువుల ఆశీస్సులు: శ్రీరాముడు ఎప్పుడూ... తల్లి దండ్రులను.. గురువులను పూజించేవాడు.. అందుకే ఎంత కష్టమైనా తండ్రి మాట ప్రకారం అడవుల బాట పట్టాడు. గురువులు చెప్పిన విధంగా నడచుకుంటూ.. అరణ్యంలో గడిపాడు.. ఆయన అడవుల్లో ఉన్నా.. నిత్యం అతని తండ్రి దశరథ మహారాజును.. తల్లి కౌసల్య.. సుమిత్ర.. కైకేయిలను పూజించేవాడు. గురువుల ఆశీర్వాదం తీసుకొని నిత్య కైంకర్యం ప్రారంభించేవాడని పురాణాలు చెబుతున్నాయి. అందుకు ఆయన జీవితంలో విజయం సాధించాడు.
శ్రీరామ నవమి సందేశం: శ్రీరామ నవమి కేవలం ఒక పండుగ కాదు. శ్రీరాముని ఆదర్శాలను మన జీవితాల్లో స్వీకరించడానికి ఒక అవకాశం. ఈ రోజున చేసే పనికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉందని పండితులు చెబుతున్నారు.