శ్రీరాంపూర్ ఏరియా గనుల్లో 147 శాతం ఉత్పత్తి : జీఎం ఎం.శ్రీనివాస్

శ్రీరాంపూర్ ఏరియా గనుల్లో 147 శాతం ఉత్పత్తి : జీఎం ఎం.శ్రీనివాస్

నస్పూర్, వెలుగు: పని స్థలాల్లో ఉద్యోగులు రక్షణ సూత్రాలు పాటించాలని, రక్షణతో కూడిన బొగ్గు ఉత్పత్తికి ప్రాధాన్యత ఇవ్వాలని శ్రీరాంపూర్‌ ఏరియా జీఎం ఎం.శ్రీనివాస్ అన్నారు. మంగళవారం జీఎం ఆఫీసులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మార్చిలో ఏరియాలోని గనులు147 శాతం ఉత్పత్తి  సాధించినట్లు తెలిపారు. ఆర్ కే5 గని 103 శాతం, ఆర్ కే6 గని 106 శాతం, ఆర్ కే7 గని 102 శాతం, ఆర్ కే న్యూ టెక్ గని 115 శాతం, ఎస్​ఆర్పీ1 గని 67 శాతం, ఎస్సార్పీ3 గని 87 శాతం,  ఐకే 1ఎ గని 82 శాతంతో భూగర్భ గనులు 95శాతం సాధించాయన్నారు. ఎస్​ఆర్పీ ఓసీపీ 168 శాతం, ఐకె ఓసీపీ 152 శాతంతో శ్రీరాంపూర్ ఏరియా 147 శాతం ఉత్పత్తి సాధించినట్లు తెలిపారు. 

ఏరియాలోని ఉద్యోగులు, అధికారులు, కార్మిక సంఘాల నాయకుల సహకారంతో వార్షిక ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించేందుకు కృషి చేస్తామన్నారు. శ్రీరాంపూర్ ఏరియాలో ఇప్పటి వరకు 3784 మంది డిపెండెంట్లకు కారుణ్య నియామక పత్రాలు అందించామని తెలిపారు. కార్యక్రమంలో ఎస్వోటు జీఎం ఎన్.సత్యనారాయణ, డీజీఎం (ఐఈడీ)  చిరంజీవులు,  సీనియర్ పీవో కాతారావు తదితరులు పాల్గొన్నారు.