రామగుండం 1,2 కంబైన్డ్టీమ్ రన్నర్
కోల్‌బెల్ట్/ఆసిఫాబాద్, వెలుగు: సింగరేణి కంపెనీ లెవల్ క్రికెట్ పోటీల్లో విన్నర్‌గా శ్రీరాంపూర్ ఏరియా జట్టు నిలిచింది. ఆసిఫాబాద్‌జిల్లా గోలేటీ భీమన్న స్టేడియంలో మూడు రోజులు నిర్వహించిన క్రికెట్ పోటీల్లో గురువారం శ్రీరాంపూర్– రామగుండం1,2 కంబైన్డ్ జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్జరిగింది. చివరి వరకు ఉత్కంఠగా సాగిన పోటీలో ఫస్ట్ శ్రీరాంపూర్జట్టు బ్యాంటింగ్ చేసి 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 122 రన్స్ చేసింది. అనంతరం బ్యాంటింగ్‌కు దిగిన రామగుండం1,2 జట్టు 20 ఓవర్లలో 121 పరుగులు చేసింది. ఒక్క పరుగు తేడాతో శ్రీరాంపూర్జట్టు విన్నర్‌గా నిలిచింది.
విజేతలకు బెల్లంపల్లి ఏరియా సింగరేణి జీఎం ఎం.శ్రీనివాస్ బహుమతులు అందజేశారు. ఏఐటీయూసీ లీడర్ తిరుపతి, ఏఎస్ వో టూజీఎం కె.రాజమల్లు, ఏరియా ఇంజినీర్ భీంరావు జాడే, ప్రాజెక్టు ఇంజినీర్ వీరన్న, పర్సనల్ మేనేజర్రెడ్డిమల్ల తిరుపతి, శ్రీరాంపూర్, భూపాలపల్లి ఏరియాల స్పోర్ట్స్ సూపర్ వైజర్లు సీహెచ్.అశోక్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.