మంచిర్యాల జిల్లా: సింగరేణి గనిలో ప్రమాదం.. కార్మికుడికి గాయాలు

మంచిర్యాల జిల్లా:  సింగరేణి గనిలో ప్రమాదం..  కార్మికుడికి గాయాలు

మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్​ ఏరియా ఇందారం సింగరేణి గనిలో ప్రమాదం జరిగింది. 1Aగనిలో జరిగిన ఈ ప్రమాదంలో ఓ కార్మికునికి గాయాలయ్యాయి.  కార్మికులు పనిచేస్తున్న సమయంలో సైడ్​ వాల్​ కూలడంతో సపోర్ట్ మెన్ గా విధులు నిర్వహిస్తున్న రాజయ్య అనే కార్మికుడికి గాయాలయ్యాయి.  ఈ ఘటనను గమనించిన తోటి కార్మికులు అధికారులకు సమాచారం అందించారు.  వెంటనే ప్రమాదంలో గాయపడిన కార్మికుడిని రామకృష్ణాపూర్​ ఏరియా ఆస్పత్రికి తరలించారు.