శ్రీశైలం ప్రమాదం.. నీళ్లు, మట్టి లోపలికి రావడంతోనే: మంత్రి ఉత్తమ్

శ్రీశైలం ప్రమాదం.. నీళ్లు, మట్టి లోపలికి రావడంతోనే: మంత్రి ఉత్తమ్

శ్రీశైలం ఎడమగట్టు కాలువ (SLBC) పనుల్లో ప్రమాదానికి కారణం నీళ్లు, మట్టి సొరంగంలోకి రావడంతోనే జరిగిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ప్రస్తుతానికి సొరంగంలో ఉన్న అందరినీ బయటకు తీసుకువచ్చారని, మరింత సమాచారం అందాల్సి ఉందని అన్నారు. సొరంగం దగ్గర కాంట్రాక్టర్లు, ఇతర సిబ్బంధి ఉన్నారని, రిలీఫ్ ఆపరేషన్ సూపర్ వైస్ చేయడానికి వెళ్తున్నట్లు ఆయన తెలిపారు. 

అయితే ఈ ప్రమాద సమయంలో సొరంగంలో 50 మంది ఉండగా 42 మందిని బయటకు తీసుకొచ్చినట్లు అధికారులు తెలిపారు. ఇంకా 8 మంది కార్మికుల ఆచూకి లభ్యం కాలేదని, వాళ్ల కోసం సహాయక చర్యలు వేగవంగంగా చేస్తున్నట్లు తెలిపారు. 

ALSO READ | శ్రీశైలం సొరంగంలో భారీ ప్రమాదం.. ఒక్కసారిగా కూలిన పైకప్పు.. శిథిలాల కింద చిక్కుకున్న కార్మికులు

ప్రమాదం జరగడంతో విద్యుత్ అంతరాయం ఏర్పడింది.  కొద్దిసేపటి క్రితమే టన్నెల్ లో విద్యుత్ ను పునరుద్ధరించారు జెన్కో అధికారులు.  బురదలో టన్నేల్ బోర్ మిషన్ కూరుకుపోయిందని, 3 మీటర్ల మేర  పైకప్పు కూలిపోయిందని తెలిపారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మంత్రులు, ఉత్తమ్, జూపల్లి హెలీకాప్టర్ లో ప్రమాద స్థలానికి బయలుదేరారు. 

శ్రీశైలం ఎగమగట్టు కాలువ (SLBC) పనుల్లో సొరంగం పైకప్పు కూలడంతో 10 మంది కార్మికులు గాయపడ్డారు.  నాగర్ కర్నూలు జిల్లా దోమల పెంట దగ్గర ఎడమవైపు సొరంగ మార్గంలో 14 కిలోమీటర్ల వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది.  రిటైన్ వాల్ ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో భారీ శబ్దాలు రావడంతో కార్మికులు భయాందోళనలకు గురయ్యారు. ఈ ప్రమాద సమయంలో టన్నెల్లో దాదాపు 50 మందికి పైగా కార్మికులు  ఉన్నారు.