![శ్రీశైలం బ్రహ్మోత్సవాలు.. తొలిసారి పట్టువస్త్రాలు సమర్పించనున్న సీఎం](https://static.v6velugu.com/uploads/2025/02/srisailam-brahmotsavam--festival--from-february-19-to-march-1-in-nandhyala-district_ivkbZ1gEOe.jpg)
ఏపీలోని నంద్యాల జిల్లా శ్రీశైలంలో ఫిబ్రవరి 19 నుంచి మార్చి 1 వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. 23న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో పాల్గొననున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. ఏపీ ప్రభుత్వం తరఫున 23వ తేదీన సాయంత్రం పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాల సమర్పించుటకు సీఎం రావటం ఇదే తొలిసారి.
ఏటా రెండు సార్లు శ్రీశైలంలో బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. మకర సంక్రాంతి,మహాశివరాత్రి సందర్శంగా బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ అధికారలు ఇప్పటి నుంచే ఏర్పాట్లు చేస్తున్నారు. మహాశివరాత్రి ఫిబ్రవరి 26 న జరిగే ప్రభోత్సవం, బ్రహ్మోత్సవ కళ్యాణం, రథోత్సవం,తెప్పోత్సవం కార్యక్రమాలకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
భక్తుల పార్కింగ్ ఏర్పాట్లు, ఉండడానికి వసతులు,తాగునీరు, అల్పాహారం వంటి వాటికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా అధికారులు ఏర్పాటు చేస్తున్నారు.