ఇన్ ఫ్లో: 4 లక్షల 12 వేల 582 క్యూసెక్కులు.. అవుట్ ఫ్లో: 2 లక్షల 46 వేల 932 క్యూసెక్కులు
కర్నూలు: శ్రీశైలం డ్యామ్ వద్ద కొద్దిసేపటి క్రితం ఐదు గేట్లు ఎత్తారు. కృష్ణా నదిలో వరద పోటెత్తుతుండడంతో నిన్న సాయంత్రం మూడు గేట్లు ఎత్తిన విషయం తెలిసిందే. ఎగువన కర్నాటక, మహారాష్ర్టలోని ఆల్మట్టి, నారాయణపూర్, తుంగభద్ర డ్యామ్ లు వరద పరవళ్లకు పొంగిపారుతున్నాయి. కృష్ణా నదిలో ఉధృతి పెరుగుతుందని ఇవాళ ఉదయం కేంద్ర జల వనరుల శాఖ విడుదల చేసిన ఫోర్ కాస్ట్ బులెటిన్ తో అప్రమత్తమైన ఏపీ జలవనరుల శాఖ అధికారులు శ్రీశైలం డ్యామ్ వద్ద మరో రెండు గేట్లు ఎత్తారు. మొత్తం ఐదు గేట్ల ద్వారా దిగువన నాగార్జునసాగర్ కు నీటి విడుదల కొనసాగుతోంది.
సీడబ్ల్యూసీ ఫోర్ కాస్ట్ బులెటిన్ లో కృష్ణా నదికి వరద మరింత పెరిగే అవకాశం ఉంది. తుంగభద్ర నదిలో వరద తగ్గుముఖం పట్టే అవవకాశం ఉన్నా.. ఆల్మట్టిలో మరింత పెరిగుగుతందని సమాచారం. ఇప్పటికే ఆల్మట్టి డ్యామ్ వారం రోజులుగా పొంగిపారుతోంది. ఇవాళ మరింత పెరిగడంతో.. నారాయణపూర్.. జూరాల మీదుగా శ్రీశైలానికి వరద పోటు పెరిగింది. శ్రీశైలం డ్యామ్ వద్ద ప్రస్తుతం ఇన్ ఫ్లో 4 లక్షల 12 వేల 582 క్యూసెక్కులు.. ఉండగా.. మొత్తం అవుట్ ఫ్లో 2 లక్షల 46 వేల 932 క్యూసెక్కులు ఉంది. శ్రీశైలం డ్యామ్ పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులతో.. 215 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 883.70 అడుగులతో.. 208.2841 టీఎంసీల నిల్వ కొనసాగుతోంది.