శ్రీశైలం ముంపు నిర్వాసితులను ఆదుకోవాలి

శ్రీశైలం ముంపు నిర్వాసితులను ఆదుకోవాలి

పంజాగుట్ట, వెలుగు: అసెంబ్లీ ఎన్నికలకు ముందు  ఇచ్చిన హామీని  సీఎం నిలబెట్టుకోవాలని శ్రీశైలం ప్రాజెక్టు ముంపు నిర్వాసితులు కోరారు. సోమాజిగూడ ప్రెస్​క్లబ్​లో సోమవారం జరిగిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. 1986 నుంచి  అధికారుల చుట్టూ తిరుగుతున్నా  తమకు న్యాయం జరగడం లేదన్నారు. ప్రాజెక్టుతో ఇళ్లు , భూములు కోల్పోయామని,  ఏళ్ల తరబడి ప్రభుత్వాల చుట్టూ తిరుగుతున్నా ఎవరూ పట్టించుకోవట్లేదన్నారు.

ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్​లో  అక్కడి నిర్వాసితులకు 2800  ఉద్యోగాలు ఇచ్చారని, తమకు  మాత్రం 2 వందల ఉద్యోగాలే ఇచ్చారని కొల్హాపూర్, అలంపూర ,  వనపర్తి వాసులు చెప్పారు. జీవో నంబరు 68 ప్రకారం అర్హులైన వారికి ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన వారు ఇంతవరకు ఎటువంటి చర్య తీసుకోలేదన్నారు. సీఎం రేవంత్​ రెడ్డి వనపర్తి సభలో తమకు న్యాయం చేస్తానని హామీ ఇచ్చారన్నారు.  ఉద్యోగాలిచ్చి తమ కుటుంబాలను ఆదుకోవాలని వారు కోరారు.