
శ్రీశైలం శ్రీ భ్రమరాంబా సమేత మల్లికార్జునస్వామివారి ఉభయ దేవాలయాల హుండీని లెక్కించారు. ఆలయ ప్రాంగణంలోని అక్కమహాదేవి అలంకార మండపంలో నిర్వహించారు. 28 రోజులకు గాను3 కోట్ల 17 లక్షల 50 వేల 290 రూపాయలు ఉభయదేవాలయాల హుండీల రాబడి వచ్చినట్లు ఈఓ పెద్దిరాజు తెలిపారు. పటిష్టమైన భద్రత సీసీ కెమెరాల మధ్య ఆలయ అధికారుల పర్యవేక్షణలో హుండీల లెక్కింపు నిర్వహించామన్నారు. నగదుతోపాటు 187 గ్రాముల 300 మిల్లిగ్రాములు బంగారం,6 కేజీల 340 గ్రాముల వెండి, వివిధ విదేశీ కరెన్సీని స్వామి అమ్మవార్లకు భక్తులు సమర్పించచారు. హుండీ లెక్కింపులో దేవస్థానం అన్ని విభాగాల అధికారులు,సిబ్బంది,శివసేవకులు పాల్గొన్నారు...
ALSO READ: ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల ఏర్పాట్లపై సమీక్ష