శ్రీశైలం హుండీ ఆదాయం రూ.4.65 కోట్లు

శ్రీశైలం, వెలుగు : శ్రీశైల మల్లన్నకు హుండీల ద్వారా రూ.4.65 కోట్ల ఆదాయం సమకూరింది. 35 రోజులకు సంబంధించి స్వామి, అమ్మవార్ల ఆలయాలతో పాటు, అన్న ప్రసాద వితరణ హుండీలను గురువారం లెక్కించారు. హుండీలో నగదుతో పాటు 488 యుఎస్ఏ డాలర్లు, 30 యూకే పౌండ్స్, 60 సింగపూర్‌‌‌‌‌‌‌‌ డాలర్లు

 10 యూరోస్‌‌‌‌‌‌‌‌, 12 కువైట్‌‌‌‌‌‌‌‌ దినార్స్‌‌‌‌‌‌‌‌, 20 హాంకాంగ్‌‌‌‌‌‌‌‌ డాలర్స్‌‌‌‌‌‌‌‌తో పాటు వివిధ దేశాలకు చెందిన కరెన్సీ వచ్చిందని ఆలయ ఈవో పెద్దిరాజు తెలిపారు. లెక్కింపులో ఆఫీసర్లు, ఆలయ సిబ్బంది, శివ సేవకులు పాల్గొన్నారు.