శ్రీశైల మల్లన్న హుండీ 27రోజుల ఆదాయం రూ.2కోట్ల 81లక్షలు.. 

శ్రీశైలం శ్రీ భ్రమరాంభ, మల్లికార్జున స్వామి ఆలయ హుండీ లెక్కింపులో 27రోజులకు గాను 2కోట్ల 81లక్షల 51వేల 743రూపాయల నగదు, 212 గ్రాముల 600మిల్లీ గ్రాముల బంగారం, 3కేజీల 770గ్రాముల వెండి ఆదాయం వచ్చినట్లు సమాచారం. నగదుతో పాటు వివిధ దేశాల విదేశీ కరెన్సీ కూడా లభ్యమైనట్లు అధికారులు తెలిపారు. పటిష్ట భద్రత మధ్య ఆలయ ఈఓ పర్యవేక్షణలో జరిగిన ఈ హుండీ లెక్కింపులో ఆలయంలోని అన్ని విభాగాలకు చెందిన అధికారులు, సిబ్బందితో పాటు శివసేవకులు పాల్గొన్నారు.