శ్రీశైలం, వెలుగు: శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయానికి ఆదివారం భక్తుల రద్దీ పెరిగింది. దీంతో క్షేత్రమంతా సందడి గా కనిపించింది. వరుసగా సెలవులు రావడంతో భక్తులు పలు ప్రాంతాల నుంచి భారీగా తరలివచ్చారు. వేకువజాము నుంచే పాతాళగంగలో పుణ్యస్నానాలుఆచరించారు. దేవుని దర్శనానికి సుమారు 5 గంటల టైం పట్టింది. భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఈఓ పెద్దిరాజు ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. క్యూలైన్లలో ఉన్న భక్తులకు ఎప్పటికప్పుడు అల్పాహారం, పాలు, మంచినీరు అందించారు. వరుసగా సెలవులు
రావడంతో సామూహిక అభిషేకాలు, గర్భాలయం అభిషేకాలు రద్దు చేశారు. భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉందని ఆలయ అధికారులు భావిస్తున్నారు.శ్రీశైలం గాట్ రోడ్డులో భారీగా ట్రాఫిక్ జామ్శ్రీశైలం క్షేత్రం ఘాట్ రోడ్డులో భారీగా ట్రాఫిక్ జామ్ పెరిగింది. మద్యాహ్నం నుంచి గంటలపాటు రోడ్లపై వాహనాలు నిలిచిపోయాయి. శ్రీశైలం నుంచి హైదరాబాద్ కు దోర్నాలకు వెళ్లే ఘాట్ రోడ్డులో అరు కిలోమీటర్ల మేరా ట్రాఫిక్ జామ్ అయింది. శ్రీశైలం నుంచి ముఖద్వారం వరకు చేరుకోవడానికి 3 గంటల సమయం పట్టింది.