అయిజ, వెలుగు: కర్నాటక రాష్ట్రం బీజాపూర్ జిల్లా సింధగి పట్టణానికి చెందిన మల్లేశ్ తన పొలంలో పండిన 50 కేజీల జొన్న బస్తాను మోసుకుంటూ శ్రీశైలం మల్లన్న దర్శనానికి వారం రోజుల కింద బయలుదేరాడు. శనివారం గద్వాల జిల్లా గట్టు మండలం బలిగెర గ్రామానికి చేరుకున్నాడు. కొంతసేపు సేదతీరాడు. తన రెండెకరాల పొలంలో తెల్ల జొన్నలు పండించానని, శ్రీశైలం మల్లన్న కు సమర్పించేందుకు తీసుకెళ్తున్నానని చెప్పడంతో స్థానికులు ఆశ్చర్యపోయారు.
మండుటెండలో పాదయాత్ర చేయడమే సాహసం అనుకుంటుండగా, జొన్నల మూటను మోస్తూ 400 కిలోమీటర్లు కాలినడకన వెళ్తున్న మల్లేశ్‌ను స్థానికులు అభినందించారు. ఇంకా 200 కిలోమీటర్ల దూరం పాదయాత్ర చేయాల్సి ఉంది.