శ్రీశైలం, వెలుగు: శ్రీశైలం దేవస్థానం అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. పురాతన, ఆధ్యాత్మిక, సంస్కృతి సంప్రదాయాల సజీవ స్వరూపంగా ఉన్నందుకు లండన్ కు చెందిన ‘ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డు’ సంస్థ గుర్తింపు సంపాదించుకుంది. జూన్4న రికార్ట్ సాధించినట్లు ప్రకటించగా, శుక్రవారం ధ్రువీకరణ పత్రాన్ని శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి, ఆలయ ఈవో పెద్దిరాజుకు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ జాయింట్ సెక్రటరీ ఉల్లాజీ ఎలియజర్ అందజేశారు.