నంద్యాల జిల్లా శ్రీశైలం మల్లన్న ఆలయంలో ఉభయ దేవాలయల హుండీని లెక్కించారు. శ్రీ భ్రమరాంబ మల్లికార్జునస్వామి అమ్మవార్ల ఉభయ దేవాలయాలు,పరివార ఆలయాల హుండీ లెక్కింపు జరిగింది. చంద్రవతి కళ్యాణ మండపంలో పకడ్బందీగా ఈ లెక్కింపు నిర్వహించగా.... శ్రీశైలం మల్లన్న దేవస్థానానికి 3 కోట్ల 22 లక్షల 53 వేల 862 రూపాయల హుండీలో కానుకల రూపంలో నగదు లభించిందని ఈవో డి.పెద్దిరాజు తెలిపారు. ఈ ఆదాయాన్ని గత 20 రోజులులో శ్రీ స్వామి అమ్మవార్లకు భక్తులు నగదును కానుకల రూపంలో సమర్పించినట్టు ఆలయ అధికారులు వెల్లడించారు.
ఇంకా నగదుతో పాటు 150 గ్రాముల 100 మిల్లి గ్రాములు బంగారం .. 5 కేజీల 250 గ్రాముల వెండి హుండీలో భక్తులు సమర్పించారని ఈవో తెలిపారు. వీటితో పాటు 746 యుఎస్ఏ డాలర్లు, ఆస్ట్రేలియా డాలర్స్-50, కెనడా డాలర్స్-125, యూకే పౌండ్స్ 70, యూఏఈ దిరామ్స్-50,26 సింగపూర్ డాలర్లు, యూరోస్ 20, మొదలైన వివిధ దేశాల విదేశీ కరెన్సీ ఈ లెక్కింపులో లభించాయి. పటిష్టమైన నిఘా నేత్రాల మధ్య దేవస్థానం ఈవో పెద్దిరాజు పర్యవేక్షణలో హుండీ లెక్కింపు జరగగా... లెక్కింపులో దేవస్థానం అన్ని విభాగాలకు చెందిన అధికారులు,సిబ్బంది,శివసేవకులు పాల్గొన్నారు...