శ్రీశైలం టోల్ గేట్ సిబ్బంది చేతివాటం : 8 మంది ఉద్యోగులపై వేటు

శివుడి మహా పుణ్యక్షేత్రం శ్రీశైలం ఆలయానికి వెళ్లే దారిలో.. ఎంట్రన్స్ లో ఓ టోల్ గేట్ ఉంటుంది. ఇక్కడ వాహనాలకు టోల్ ఛార్జీ వసూలు చేస్తారు. ఇది ఎన్నో ఏళ్లుగా కొనసాగుతుంది. ఈ టోల్ గేట్ లో పని చేసే సిబ్బంది.. ఇటీవల కాలంలో చేతివాటం చూపిస్తున్న విషయంలో.. తనిఖీల్లో బయటపడింది. ఈ క్రమంలోనే.. ఏకంగా ఎనిమిది మంది సిబ్బందిపై వేటు వేశారు శ్రీశైలం దేవస్థానం అధికారులు. 

టోల్ గేట్ దగ్గర అధికారులు ఆకస్మిక తనిఖీ చేపట్టారు. ఆ సమయంలో టోల్ గేట్ లో ఉండాల్సిన డబ్బు కంటే ఎక్కువ ఉంది. ఎక్కువగా ఉన్న డబ్బు విషయంపై ప్రశ్నిస్తే.. సిబ్బంది ఎలాంటి సమాధానం చెప్పలేదు. విచారణలో అధికంగా డబ్బులు వసూలు చేస్తున్నట్లు నిర్థారణ కావటంతో.. వేటు వేశారు అధికారులు. 

శ్రీశైలం కు వచ్చే ప్రతి వాహనం నుంచి దేవస్థానం ఏర్పాటు చేసిన టోల్ గేట్  ద్వారా.. హనదారుల నుంచి ఫీజు వసూలు చేస్తారు. దేవస్థానం అధికారులు 2025, జనవరి 5 తేదీన ఆకస్మికంగా తనిఖీ చేయగా ఈ బండారం బయటపడింది. అప్పటి నుంచి విచారణ చేయగా.. అధికంగా డబ్బులు వసూలు చేయటం.. ఆన్ లైన్ పేమెంట్ కాకుండా వాహనదారుల నుంచి అధికంగా డబ్బులు వసూలు చేస్తున్నట్లు స్పష్టం అయ్యింది.  ఈ క్రమంలోనే టోల్ గేట్ దగ్గర పని చేసే రెగ్యులర్ ఉద్యోగి ఎం రామకృష్ణుడు, కాంట్రాక్టు సిబ్బంది నాగ పరమేశ్వరుడు, జి మల్లికార్జున రెడ్డి, ఎన్ గోవిందు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు మల్లికార్జునరెడ్డి, బిఆర్ మల్లేశ్వర్ రెడ్డి, డైలీ వేజ్ సిబ్బందిని తొలగించారు అధికారులు. ఈవో శ్రీనివాసరావు ఆదేశాల మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. ప్రస్తుతం టోల్ గేట్ దగ్గర కొత్త సిబ్బందిని నియమించారు శ్రీశైలం ఈవో శ్రీనివాసరావు.