
కౌడిపల్లి, వెలుగు: జిల్లాస్థాయి దివ్యాంగుల ఆటల పోటీల్లో మండలంలోని వెల్మకన్న గ్రామానికి చెందిన దివ్యాంగురాలు కుమ్మరి శ్రీవాణి ప్రతిభచాటింది. బుధవారం మెదక్ ఇందిరా గాంధీ స్టేడియంలో నిర్వహించిన జిల్లాస్థాయి పోటీల్లో ఆమె షార్ట్ పుట్ లో ప్రథమ స్థానం, పరుగు పందెంలో ద్వితీయ స్థానం, క్యారమ్స్ లో ద్వితీయ స్థానంలో నిలిచింది.
అలాగే పోతిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన ఆగమయ్య చదరంగం, క్యారమ్స్ లో ద్వితీయ స్థానంలో నిలిచినట్టు పీఈటీ రాజేందర్ తెలిపారు.