
లేడి అఘోరీ, మంగళగిరి యువతి శ్రీవర్షిణి ఉదంతం సంచలనం రేపిన సంగతి తెలిసిందే.. సుమారు నెలరోజులుగా సాగుతున్న ఈ డ్రామా తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఎట్టకేలకు ఈ ఇరిటేటింగ్ డ్రామాకు తెర దించారు గుజరాత్ పోలీసులు. లేడీ అఘోరీ చెర నుంచి శ్రీవర్షిణిని విడిపించారు గుజరాత్ పోలీసులు.
శ్రీవర్షిణి మేజర్ అని బుకాయిస్తూ శుక్రవారం ( ఏప్రిల్ 4 ) గుజరాత్ పోలీసులకు చుక్కలు చూపే ప్రయత్నం చేసింది అఘోరీ. అయితే.. గుజరాత్ పోలీసులు పోలీసులు తమ స్టైల్ లో మర్యాదలు చేయడంతో లొంగిపోయింది అఘోరీ. లేడీ అఘోరీ చెర నుంచి శ్రీవర్షిణిని విడిపించిన పోలీసులు ఆమెను కుటుంబసభ్యులకు అప్పగించారు.
మార్చి నెలలో మంగళగిరిలోని శ్రీవర్షిణీ తల్లిదండ్రుల ఇంట్లో బస చేసిన అఘోరీ.. మాయమాటలు చెప్పి శ్రీవర్షిణిని లోబరుచుకుంది. నెల రోజులుగా శ్రీవర్షిణి అఘోరీతో కలిసి ఉంటుంది. తమ కూతురుకి మాయమాటలు చెప్పి ఎత్తుకెళ్లిందని శ్రీవర్షిణి తల్లిదండ్రులు మంగళగిరి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్దు జరిపారు పోలీసులు. పోలీసుల దర్యాప్తులో విస్తుపోయే నిజాలు బయటికి వచ్చాయి.
నెలరోజుల పాటు సస్పెన్స్ కొనసాగిన ఈ కేసుకు ఎట్టకేలకు చెక్ చెప్పారు గుజరాత్ పోలీసులు. సనాతన ధర్మ రక్షణ పేరుతో వికృత చేష్టలకు పాల్పడుతున్న అఘోరీకి పోలీసులు సరైన బుద్ధి చెప్పాలని కోరుతున్నారు ప్రజలు.