Thalaimai Seyalagam Official OTT: ఓటీటీలోకి శ్రీయారెడ్డి పొలిటికల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్..తెలుగు స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్

Thalaimai Seyalagam Official OTT: ఓటీటీలోకి శ్రీయారెడ్డి పొలిటికల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్..తెలుగు స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్

 

స‌లార్ (Salaar)లో వ‌ర‌ద‌రాజు సోద‌రి పాత్రలో శ్రియా రెడ్డి (Shriya Reddy) అద‌ర‌గొట్టేసింది. సినిమాలో ఆమె లుక్కి..న‌ట‌న‌కి మంచి మార్కులే ప‌డ్డాయి. కొందరైతే శ్రియా రెడ్డి పాత్రని 'బాహుబ‌లి' సినిమాలో ర‌మ్యకృష్ణ చేసిన శివ‌గామి పాత్రతో పోల్చుతున్నారు.దీంతో శ్రియా రెడ్డి పేరు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా వినిపిస్తోంది. దీంతో  శ్రియ రెడ్డి సలార్లో పోషించిన రాధా రామ పాత్ర తనకి మంచి గుర్తింపు రావడంతో వరుస అవకాశాలు తలుపు తడుతున్నాయి. 

లేటెస్ట్గా శ్రియా రెడ్డి ప్రధాన పాత్రలో నటించిన పొలిటికల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ తలైమై సేయలగం(Thalaimai Seyalagam).తమిళంలో తెరకెక్కిన ఈ పొలిటికల్ థ్రిల్లర్ సిరీస్ జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చేస్తోంది.ఈ వెబ్ సిరీస్ మే 17న తమిళం, తెలుగు భాషల్లో స్ట్రీమింగ్‍కు రానున్నట్లు జీ5 ప్రకటించింది.రీసెంట్గా రిలీజ్ చేసిన టీజర్ సీరియస్ ఇంటెన్స్ మోడ్ లో ఆసక్తికరంగా ఉంది. దీంతో ఈ సిరీస్ పై భారీ అంచనాలున్నాయి. 

ఈ పొలిటికల్ థ్రిల్లర్ డ్రామా సీరిస్ కు జాతీయ అవార్డు దర్శకుడు వసంతబలాన్ దర్శకత్వం చేస్తున్నాడు.ఇందులో కిశోర్,శ్రీయారెడ్డి ముఖ్య పాత్రల్లో నటిస్తుండగా ప్రేమిస్తే భరత్, రమ్య నంబీషన్,ఆదిత్య మీనన్,సంతాన భారతి కీలకపాత్రలు పోషించారు.

తలైమై సేయలగం వెబ్ సిరీస్‍ను రాడాన్ మీడియా వర్క్స్ ఇండియా లిమిటెడ్ పతాకంపై రాధికా శరత్ కుమార్,శరత్ కుమార్ ప్రొడ్యూస్ చేస్తున్నారు.ఈ మూవీకి జిబ్రాన్ మ్యూజిక్ అందిస్తుండగా రవిశంకర్ సినిమాటోగ్రఫీ చేశారు. 

శ్రియా రెడ్డి సినిమాల విషయానికి వస్తే..పందెంకోడి చిత్రంలోని ఈమె నటనకు మంచి పేరు వచ్చింది.పొగరు,అమ్మ చెప్పింది వంటి చిత్రాలలో శ్రియా రెడ్డి నటించింది. ఇక ఈమె హీరో విశాల్ బ్రదర్ విక్రమ్ కృష్ణ భార్య.  

పవన్ కల్యాణ్ ఓజీ మాత్రమే కాకుండా బ్రో, క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో 'హరి హర వీరమల్లు',హరీష్ శంకర్ దర్శకత్వంలో 'ఉస్తాద్ భగత్ సింగ్'సినిమాలు చేస్తున్నారు.ఇందులో ఏ మూవీ ముందుగా రిలీజ్ అవుతుందో తెలియదు.